ఢిల్లీ సాక్షిగా కుట్రల చేయడం మీ మరిదికి అలవాటే

చంద్ర‌బాబు తీరుపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్లు

న్యూఢిల్లీ: చంద్ర‌బాబు త‌న జీవితంలో ఎవ్వ‌రికీ విశ్వ‌స‌నీయ‌మైన స్నేహితుడు కాలేడ‌న్న క‌మ్మ‌టి వాస్త‌వం ఢిల్లీ నుంచి గ‌ల్లీ దాకా అంద‌రికీ తెలుస‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ఈ మేర‌కు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో ట్వీట్లు చేశారు. 

``ఢిల్లీ సాక్షిగా కుట్రల చేయడం మీ మరిది గారికి అలవాటే. కానీ ఈసారి మిమ్మల్నీ తీసుకెళ్లి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు చూడండి.. అదీ హైలైట్. చంద్రబాబు జీవితంలో ఎవ్వరికీ విశ్వసనీయమైన స్నేహితుడు కాలేడన్న కమ్మటి వాస్తవం ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరికీ తెలుసు.``

``ఇంతకంటే ఆధారం కావాలా? చిన్నమ్మా! పురంధేశ్వరి! పతీసమేతంగా మరిదిని తీసుకెళ్లి మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఏదో చెప్పే ప్రయత్నం. బీజేపీకి తెలీదా, మీరంతా ఒకటే అని. అందుకేకదా దొంగ చేతికే తాళం ఇచ్చింది!`` అని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top