కాసేప‌ట్లో వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కం ప్రారంభం

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని మ‌రో ప‌థ‌కం అమ‌లుకు సిద్ధ‌మైంది. కాసేప‌ట్లో  వైయస్ఆర్ చేయూత ప‌థ‌కాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించ‌నున్నారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో నుంచి ల్యాప్‌టాప్ బ‌ట‌న్ నొక్కి వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు. వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మ‌హిళ‌ల‌ బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా రూ.18,750 జ‌మ‌కానున్నాయి. ఈ ప‌థ‌కం ద్వారా నాలుగేళ్ల‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మ‌హిళ‌ల‌కు రూ.75 వేల ఆర్థిక‌సాయం అంద‌నుంది. దాదాపు 25 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు ల‌బ్ధిపొంద‌నున్నారు. వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కానికి ప్ర‌భుత్వం రూ.4700 కోట్లు కేటాయించింది.

తాజా వీడియోలు

Back to Top