ఈ ఐదేళ్లలో ఏపీకి ఏం చేశావు బాబూ..

ఇదేనా ప్రజల భవిష్యత్‌.. భద్రత

చంద్రబాబు నోరు తెరిస్తే మోసం,అబద్ధాలే..

వైయస్‌ఆర్‌ పథకాలను ప్రజలు గుర్తుచేసుకోవాలి

సోంపేట ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ విజయమ్మ

శ్రీకాకుళం జిల్లా:చంద్రబాబు 650 పైచిలుకు వాగ్ధానాలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని వైయస్‌ విజయమ్మ మండిపడ్డారు.ఆమె శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. మీ భవిష్యత్‌ నాభద్రత అని చంద్రబాబు చెబుతున్నారని,ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఏవిధంగా భదత్ర,భవిష్యత్‌ ఇచ్చారని ప్రశ్నించారు. జిల్లాకు ఎయిర్‌పోర్ట్‌ వచ్చిందా..పుడ్‌పార్క్‌ వచ్చిందా..శ్రీకాకుళాన్ని హైదరాబాద్‌ చేస్తానన్నారు చేశారా..ఆముదాలవలస షుగర్‌ఫ్యాక్టరీని తెరిపించారా..వంశధార,నాగవళిని పూర్తిచే సారా..ఒకటైనా చేశారా అని ప్రశ్నించారు. ప్రజలందరూ ఒకసారి వైయస్‌ఆర్‌ పథకాలను గుర్తుచేసుకోవాలన్నారు. వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఎన్నో  సంక్షేమ పథకాలు ప్రజలు పొందుకున్నారన్నారు.  ఏ నాయకుడు అయినా కూడా ఇది చేశాను అని చెప్పి ఓటు అడగాలి. ఏం  చేశారని చంద్రబాబు ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు ఉందా..రాజశేఖర్‌రెడ్డి ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌. రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కుల,మత,పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు. విద్యుత్‌ ఛార్జీలు గాని, ట్యాక్స్‌లుగాని  పైసా పెంచకుండా వైయస్‌ఆర్‌ ప్రభుత్వాన్ని నడిపారన్నారు. చంద్రబాబు హయాంలో లెక్కలేనిసార్లు ఛార్జీలు పెంచారన్నారు. చంద్రబాబు 650 వాగ్ధానాలు చేసి మోసం చేశాడు.

ఐదుమాఫీలు చేస్తానని చెప్పారు.చేశారా..వైయస్‌ఆర్‌ హయాంలో రైతుల రుణమాఫీ,ఉచిత విద్యుత్,కరెంటు బకాయిల మాఫీ,గిట్టుబాటు ధరలు,రైతులకు బీమా వంటి అన్నిరకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.చంద్రబాబు హయాంలో రైతులకు బీమా కూడా ఇవ్వలేదు.కనీసం మద్దతు ధరలు కూడా ఇవ్వలేదు.ఆ రోజు పసుపు 14వేల రూపాయలు అయితే నేడు ఆరు వేలు కూడా ఉండటం లేదు.,ఆరోజు వరి వెయ్యి నుంచి పదకొండు వందల రూపాయలకు పెరిగింది. నేడు ఎంత ఉంది.తొమ్మిదేళ్లు తర్వాత కేవలం 13 వందలు మాత్రమే గిట్టుబాటు ధర ఉంది.మిర్చి ఆరోజు  12వేలు ఉంటే..నేడు ఆరువేలు కూడా ఉండటం  లేదు. రైతులకు 25వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పాడు..నేడు లక్షా 50వేల కోట్లకు రుణం పెరిగింది. చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమయ్యింది.రైతులకు కనీసం భద్రత,భరోసా కల్పించలేకపోతున్నారు.డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు 14వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు.నేడు ఆ రుణం 25 వేల కోట్ల రూపాయలు అయ్యింది.ఎన్నికల సమీపంలో  పసుపు–కుంకుమ అంటూ చంద్రబాబు మోసం చేస్తున్నాడు.

.పసుపు–కుంకమ ఇస్తున్నారా..మీకు రావాల్సిన వడ్డీరాయితీల్లో  కొంచెం తీసి మీకు ఇస్తున్నారు.ప్రజలందరూ గమనించాలన్నారు.రెండు రూపాయలకే 20 లీటర్ల నీరు ఇస్తానని చెప్పారు..ఇస్తున్నారా...బార్‌ షాపులను రద్దుచేస్తానని చెప్పారు.రద్దు చేశారా.. నీళ్లు దొరకడంలేదు కాని, మద్యం మాత్రం సంపూర్ణంగా  దొరుకుతుందన్నారు.ఇదేనా మీ భవిష్యత్‌కు భదత్ర..బాబు వస్తే జాబు రావాలంట..జాబులు వచ్చాయా..రెండు లక్షల నలభై వేలుపైగా ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి. కనీసం నోటిఫికేషన్‌ అయినా విడుదల చేశారా..ఉద్యోగం రాకపోతే రెండువేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు..ఇచ్చారా..చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు,ప్రలోభాలు,మోసాలు..పరిపాలన జరుగుతుందా..ప్రతిపేదవాడికి కార్పొరేట్‌ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో వైయస్‌ఆర్‌ ఆరోగశ్రీని ప్రవేశపెట్టారని, కొన్ని లక్షల మందికి  ఆపరేషన్లు జరగాయన్నారు. చంద్రబాబు పాలనలో ఆరోగశ్రీ హైదరాబాద్‌లో కూడా వర్తించడంలేదు.ఎన్నికలు రెండు నెలలు ఉన్నాయగా.ఎన్టీఆర్‌ సేవ పేరుతో 5 లక్షలు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు.ఆసుప్రతులకు ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా నేటివరుకు ఇవ్వలేదు.జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత  1000 రూపాయలు దాటిన ప్రతి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా చేస్తారు. దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునే అవకాశం ఇస్తాం.ఎంత ఖరీదైనా ఆపరేషన్‌ అయినా,వైద్యం అయినా సరే ఉచితంగా అందిస్తాం.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నెలనెలా ప్రత్యేకంగా పింఛను ఇచ్చే ఏర్పాటు చేస్తాం. వైయస్‌ఆర్‌ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా కొన్ని లక్షల మంది పేద విద్యార్థులు చదువుకున్నారు. నేడు చంద్రబాబు హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందుతుందా..ఏ కాలేజిలు చూసిన ప్రభుత్వం డబ్బులు చెల్లించంలేదని చెబుతున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేశారు. చదువుకి ఎవ్వరికి పేదరికం అడ్డు కాకుడదు..జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత చదువులు చదివిస్తాం.నూటికి నూరుశాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తాం.వసతి,భోజనానికి అదనంగా ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. అమ్మఒడి పథకం ద్వారా మీ పిల్లల్ని బడికి పంపితే చాలు మీ చేతికే సంవత్సరానికి 15 వేలు ఇస్తాం.  వైయస్‌ఆర్‌ హయాంలో దేశమంతట 48 లక్షల ఇళ్లు కట్టితే..మన రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లు నిర్మించారు. నేడు చంద్రబాబు నాయుడు ఇళ్లు కట్టించకపోయిన  ఇళ్లు కట్టించానని చంద్రబాబు చెబుతున్నారు.జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు,కులాలు,మతాల,వర్గాలకు అతీతంగా పేదలందరికి పక్కా ఇళ్లు కట్టిస్తాం.ప్రతి ఇల్లు అక్కచెల్లెమ్మల పేరు మీదే రిజిష్టర్‌ చేయిస్తాం.ఆ ఇంటిపై పావలా వడ్డీకే రుణాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం.. ప్రత్యేకహోదా సాధించాలంటే  25 మంది ఏపీలను గెలిపించుకోవాలన్నారు.మీరు ఓటు వేసే ముందు వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి,జగన్‌ను గుర్తుపెట్టుకోవాని కోరారు. 

Back to Top