చంద్రబాబు ఐదేళ్ల పాలన అంతా మోసం

నాయుడుపేట వైయస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ

40 ఏళ్ల రాజకీయం అనుభవం ఏమైంది..?

వైయస్‌ఆర్‌ హయాంలోనే ప్రతి ఒక్కరికి మేలు జరిగింది

మీ అందరి ఆప్యాయత మరవలేనిది

అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తాం

 

నెల్లూరు జిల్లాఃచంద్రబాబు అబద్ధపు వాగ్ధానాలతో అన్ని వర్గాలను మోసం చేశాడని వైయస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ ధ్వజమెత్తారు.నాయుడుపేట ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు.40 ఏళ్లు అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రజలకు ఏమీచేశారో చెప్పాలని ప్రశ్నించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..విజయమ్మ మాటల్లోనే.. 

వైయస్‌ఆర్‌ పాలనను ఒకసారి గుర్తుకుతెచ్చుకోవాలి. చంద్రబాబు పాలనలో సంక్షేమం,అభివృద్ధి లేదు. ధర్మానికి,అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. విలువలకు,విశ్వసనీయతకు పట్టం కట్టాలి.వైయస్‌ఆర్‌ 1978లో ఎమ్మెల్యే అయ్యారు.2004లో ముఖ్యమంత్రి అయ్యారు.ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు.వ్యవసాయం పండగ చేయాలని జలయజ్ఞం చేపట్టారు.అభివృద్ధి ఒక వైపు,సంక్షేమం ఒక వైపు రెండు కళ్లుగా పరిపాలన చేశారు.వైయస్‌ఆర్‌ 71 లక్షల మందికి పెన్షన్‌ ఇచ్చారు. ప్రతి ఒక్కరి ఇల్లు ఉండాలని దేశంలో 48 లక్షల ఇళ్లు కడితే మన ఒక రాష్ట్ర్రంలో 48 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత వైయస్‌ఆర్‌ది.ఆహార భద్రత ఉండాలని రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారన్నారు. ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డు ఇచ్చారు. 110 రూపాయలకు తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చేవారు. పేదలు అప్పులుపాలవ్వకుండదని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారన్నారు.పేదవారు పిల్లలు పేదవాళ్లుగా ఉండకూడదని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టారు.వైయస్‌ఆర్‌ ఐదు సంవత్సరాల 3నెలలు మాత్రమే పరిపాలించారు. ఆయన హయాంలో శాచురేషన్‌ పద్దతిలో కుల,మత,పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు.

వైయస్‌ఆర్‌ పాలనలో ఒక పైసా పన్నులు,చార్జీలు పెరగలేదు.కేంద్ర ప్రభుత్వం 50 గ్యాస్‌ ధర పెంచితే అక్కచెల్లెమ్మలకు భారం కాకూడదని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందన్నారు.జలయజ్ఞం ప్రారంభించి. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ,పరిశ్రమలు తీసుకువస్తూ ఒక పైసా కూడా పన్నులు పెంచని ప్రభుత్వం ఒక వైయస్‌ఆర్‌ ప్రభుత్వమే..ప్రపంచంలోనే రికార్డు..2009లో ఎన్నికల్లో చెప్పింది..చెప్పలేనిది చేసి ఓటు వేయండని వైయస్‌ఆర్‌ ఓటు అడిగారు.ప్రజలు ఆయనను మళ్లీ సీఎం పీఠంపై కూర్చోపెట్టారు. వైయస్‌ఆర్‌ మరణం తర్వాత ప్రజలకు,మా కుటుంబానికి కూడా కష్టకాలం.వైయస్‌ఆర్‌ మరణంతో నాకు వచ్చిన కష్టం కంటే ఈ రాష్ట్రానికి జరిగిన నష్టమే ఎక్కువ.హైదరాబాద్‌ లేని రాష్ట్రంగా మిగిలాం. నేడు రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం.ఎటువంటి పాలన సాగడంలేదు.తొమ్మిది సంవత్సరాల కాలంలో వైయస్‌ జగన్‌ ప్రజల కోసమే నిరంతరం పోరాటం చేశారు.వైయస్‌ఆర్‌ మరణంతో వందలాది ప్రాణాలు ఆగిపోయాయి.వారి కుటుంబాలను ఓదార్చడానికి వైయస్‌ జగన్‌ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పు యాత్ర చేపట్టారు.ప్రజలు ఎంతో ఆదరణ చూపారు. కాంగ్రెస్‌కు వైయస్‌ జగన్‌ ఓదార్పుయాత్ర చేయడం నచ్చలేదు.ఓదార్పు చేయొద్దని కండిషన్లు పెట్టారు.

ఓదార్పుయాత్రకు,ఎమ్మెల్యేలను,మంత్రులను వెళొద్దని షరతులు విధించారు.వైయస్‌ జగన్‌.. సోనియాగాంధీ వద్దకు వెళ్ళినప్పుడు కేంద్రమంత్రిని చేస్తానని చెప్పారు. నాకు కావాల్సింది కేంద్రమంత్రి కాదు. ఓదార్పుయాత్రకు పర్మిషన్‌ కావాలని వైయస్‌ జగన్‌ అడిగారు.అనుమతి ఇవ్వకపోయినా..ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఓదార్పు యాత్ర కోసం వైయస్‌ జగన్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చారు.రాజీనామా చేసే కనీసం పిలిపించి కూడా అడగలేదు. ఆ రోజు కడప ప్రజలు 5లక్షల 45 వేల మెజార్టీ ఇచ్చి వైయస్‌జగన్‌ను గెలిపించారు. కాంగ్రెస్,టీడీపీలు కలిపి వైయస్‌ జగన్‌పై అనేక కుట్రలు చేశారు.అక్రమ కేసులు బనాయించారు.సీబీఐ,ఈడీ దాడులు చేశారు.ఆస్తులను అటాచ్‌ చేశారు..ఎలక్షన్‌ సమయంలో విచారణ పేరుతో పిలిచి వైయస్‌ జగన్‌ను జైలుకు కూడా పంపించారు. రాజీనామాలు చేసిన 18 మంది ఎమ్మెల్యేలు,ఒక ఎంపీని గెలిపించుకోవడం కోసం బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రజలందరూ తోడుగా ఉన్నారు. ప్రజల కోసం వైయస్‌ జగన్‌ గల్లి నుంచి ఢిల్లీ దాకా అనేక పోరాటాలు చేశాడు. నేడు ప్రత్యేకహోదా నిలబడిందంటే అది వైయస్‌ జగన్‌ వల్లనే..ఎన్నికలు రానే వచ్చేశాయి.గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేసి మోసపోయారు.  650 వాగ్ధానాలు ఇచ్చి మోసం చేశాడు.నేడు ఒక హామీ కూడా నెరవేర్చలేదు.నలభై సంవత్సరాల అనుభవం ఉందని రాజధాని నిర్మిస్తానని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు.

ఒక శాశ్వత భవనానికి ఇటుక కూడా పడలేదు. వైయస్‌ జగన్‌ ప్రజలే కుటుంబంగా భావిస్తున్నారు.ఒక సంతకంతో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు రుణమాఫీ చేశాడా..అని అడుగుతున్నా..మాఫీ చేస్తానని చెప్పి రోడ్డు మీద పడేసి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాడు.వైయస్‌ జగన్‌ రైతులకు సంవత్సరానికి పెట్టుబడి సాయంగా 12,500 ప్రకటించిన తర్వాత చంద్రబాబుకు అన్నదాత సుఖిభవ గుర్తుకు వచ్చిందా అని అడుగుతున్నా..చంద్రబాబు వేసే మూడు వేలకు,నాలుగు వేలకు మోసపోవద్దని కోరుతున్నా..చంద్రబాబు అన్నిరకాలుగా మోసం చేశారు.వైయస్‌ఆర్‌ కాలంలో పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించారు.వైయస్‌ఆర్‌ పాలనలో రైతులు ధీమాగా ఉండేవారు.చంద్రబాబు హయాంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.చంద్రబాబు పాలనలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు రుణమాఫీ జరిగిందా అని అడుగుతున్నా.

వైయస్‌ఆర్‌ హయాంలో పావలా వడ్డీలకే రుణాలు ఇచ్చారు. హామీలు అమలు చేయని చంద్రబాబు పెద్దన్న ఎలా అవుతాడు. చంద్రబాబు పాలనలో ఇసుక నుంచి ఆలయ భూముల వరుకు అన్నింటిని దోచేస్తున్నారు.బెల్ట్‌షాపులు రద్దు చేస్తానన్నాడు చేశాడా..ఎక్కడా చూసిన గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది.తాగునీరు,సాగునీరు దొరకడంలేదు కాని మద్యం మాత్రం సంపూర్ణంగా దొరుకుతుంది.వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే దశలవారీగా మద్యపానం నిషేధం చేస్తారు. ఎన్నికల నాటి వరుకు పొదుపు సంఘాల్లో మీకు అప్పు ఎంతైతే ఉందో ఆ మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా మీ చేతికి ఇస్తాం.సున్నావడ్డీకే రుణాలు ఇచ్చి బ్యాంకుల వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారీటీ అక్కలకు కార్పొరేషన్ల ద్వారా 75 వేలు దఫాలుగా అందిస్తాం. మి పిల్లల్ని బడికి పంపితే చాలు అమ్మ ఒడి పథకం ద్వారా మీ చేతికే సంవత్సరానికి 15 వేలు ఇస్తాం.

విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తాం.నూటికి నూరుశాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తాం. వసతి,భోజనానికి అదనంగా ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. ఖాళీగా ఉన్న 2 లక్షల 30వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తాం. గ్రామ సచివాలయాల ద్వారా యువతకు గ్రామానికి 10 ఉద్యోగాలు ఇస్తాం. 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటిర్‌ ద్వారా ప్రభుత్వ పథకాలు మీ ఇంటికే అందేలా డోర్‌ డెలివరీ చేస్తాం. గ్రామ వాలంటిర్‌కు 5 వేలు గౌరవ వేతనం ఇస్తాం. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేస్తాం.దీని కోసం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతాం.అందరూ రాజశేఖర్‌రెడ్డి పాలన గుర్తుచేసుకోవాలి.ఆయన పెట్టిన పథకాలను గుర్తుచేసుకోవాలి.వైయస్‌ జగన్‌ సీఎం అయితే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది.ఫ్యాన్‌ గుర్తుపై ఓటువేసి వైయస్‌ఆర్‌సీపీ గెలిపించాలని కోరుతున్నా..

 

 

 

Back to Top