టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం 

చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు.

బాబు హయాంలో మహిళలపై దాడులు పెరిగాయి

ఇసుక నుంచి ఆలయ భూములు దాకా దోచుకుంటున్నారు

టీడీపీకి ఓటు వేసి మళ్లీ మోసపోవద్దు

రావికమతం ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ విజయమ్మ

 

విశాఖ జిల్లా: చంద్రబాబు అబద్ధాల హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని, టీడీపీకి ఓటు వేసి మళ్లీ మోసపోవద్దని వైయస్‌ విజయమ్మ అన్నారు.చోడవరం నియోజకవర్గం రావికమతం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు.

ప్రసంగం ఆమె మాటల్లోనే..

నేడు న్యాయానికి,అన్యాయానికి మధ్య యుద్ధం జరుగుతుంది.విలువలకు,విశ్వసనీయతకు పట్టం కట్టండి. వైయస్‌ఆర్‌ కుటుంబానికి మీకు ఉన్న సంబంధం 40 సంవత్సరాల సంబంధం. వైయస్‌ఆర్‌ను 30 సంవత్సరాలు భుజ  స్కందాలపై మోసి సీఎంను చేసుకున్నారు.1978లో వైయస్‌ఆర్‌ ఎమ్మెల్యే అయ్యారు.2004లో ముఖ్యమంత్రి అయ్యారు. 25 సంవత్సరాల్లో ప్రతి జిల్లాకు కనీసం 60,70 సార్లు వచ్చారు.కొన్ని లక్షల మందిని పేర్లు పెట్టి పిలవగలిగే చనువు వైయస్‌ఆర్‌కు ఉండేది.వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఏ జిల్లాకు ఏం కావాలనేది ఆయన మైండ్‌లో బ్లూప్రింట్‌ ఉందనుకుంటా..వైయస్‌ సీఎం అయ్యాక జలయజ్ఞం ద్వారా రైతులకు మేలు చేశారు. అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టారు.ఉత్తరాంధ్ర స్రవంతి,వంశధార, మహేంద్ర తనయ, తోటపల్లి, జంఝావతి రబ్బర్‌ డ్యాం వంటి ప్రాజెక్టులు నిర్మించారు.ప్రాజెక్టులకు 80  నుంచి 90 శాతం పనులు వైయస్‌ఆర్‌ హయాంలోనే జరిగాయి.

చంద్రబాబు హయాంలో ఎక్కడివేసిన గొంగళి అక్కడే ఉంది. వైయస్‌ఆర్‌ హయాంలో శాచునేషన్‌ పద్దతిలో కుల,మత,పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు.నేడు చంద్రబాబు హయాంలో రేషన్‌కార్డు,ఆధార్‌కార్డు,మరుగుదొడ్లు ఏమి కావాలన్న జన్మభూమి కమిటీ సిపార్సు చేస్తేనే వస్తున్నాయి.వైయస్‌ఆర్‌ ప్రభుత్వంలో పన్నులు ఒక పైసా కూడా పెంచకుండా ప్రభుత్వాన్ని నడిపించారు.వైయస్‌ఆర్‌ పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు.వైయస్‌ఆర్‌ ప్రభుత్వాన్ని చూడటం కోసం 13 రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చారు. ఒక పైసా కూడా పన్ను పెంచకుండా ఎలా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని తెలుసుకున్నారు. మెదీ సీఎంగా ఉన్న  గుజరాత్‌ నుంచి కూడా అధికారులు వచ్చారు. వైయస్‌ఆర్‌ ప్రతి క్షణం  ప్రజల కోసమే ఆలోచించేవారు.ప్రజలను కుటుంబంగా భావించేవారు.

2009లో ఎన్నికల సమయంలో వైయస్‌ఆర్‌ మీ ముందుకు ఒక్కటే చెప్పారు. చెప్పింది చేశాను..చెప్పలేనిది కూడా చేశానని  చెప్పారు. ఎన్నికల ముందు ఒక వాగ్ధానం కూడా చేయలేదు.నాయకుడిగా తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.2009లో ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.చివరి వరుకు కూడా వైయస్‌ఆర్‌ ప్రజల కోసమే ఆలోచించారు.వైయస్‌ఆర్‌ మరణంతో వందల మంది గుండెలు ఆగిపోయాయి.వైయస్‌ జగన్‌ ఆరోజు పావురాల గుట్ట వద్ద ఓదార్పు యాత్ర చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పు యాత్ర చేశారు.ప్రజలు ఎంతో ఆదరణ చూపి అక్కున చేర్చుకున్నారు.తెల్లవారు జామున కూడా ఓదార్పు యాత్ర సాగింది.వైయస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర కాంగ్రెస్‌కు నచ్చలేదు.  ఓదార్పు యాత్ర చేయవద్దని తెలిపారు.వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పు చేశారు.వైయస్‌ జగన్‌ను పొమ్మనలేక పొగబెట్టి బయటకు వెళ్ళే పరిస్థితిని కల్పించారు. జగన్‌పై కాంగ్రెస్,టీడీపీలు ఎన్నో కుట్రలు పన్నారు.అక్రమ కేసులు పెట్టి సీబీఐ.ఈడీ విచారణతో వేధింపులకు గురిచేశారు.జైలుకు కూడా పంపించారు.

వైయస్‌ఆర్‌ ఆశయాల కోసం పుట్టి పార్టీ వైయస్‌ఆర్‌సీపీ.ప్రజల అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ వైయస్‌ఆర్‌సీపీ.వైయస్‌ఆర్‌ బతికుండగా ఎన్నడూ నేను బయటకు రాలేదు.18 మంది ఎమ్మెల్యేలను,ఒక ఎంపీని  గెలిపించుకోవడం కోసం బయటకురావాల్సి  వచ్చింది.ఆ రోజు ప్రజలు ఎంతో ఆదరించారు. ప్రజలకు మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది.రాష్ట్ర ప్రజలు ఎవరూ వైయస్‌ కుటుంబాన్ని వదిలిపెట్టలేదు.తొమ్మిది సంవత్సరాల  కాలంలో జైల్లో 16 నెలలు తప్పితే..నిత్యం ప్రజలతోనే ఉన్నారు.రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేశారు.గల్లినుంచి ఢిల్లీ దాకా మన సమస్యలు వినిపించారు. కడుపుమాడ్చుకుని దీక్షలు చేశారు. ప్రత్యేకహోదా నిలబడిదంటే వైయస్‌ జగన్‌ వల్లనే. తొమ్మిది సంవత్సరాలు ప్రజల కోసమే శ్రమించారు. వైయస్‌ఆర్,షర్మిలమ్మ,జగన్‌లు పాదయాత్ర చేసిన ఎప్పుడూ ప్రజలు ఒంటరిగా వదిలిపెట్టలేదు

వైయస్‌ కుటుంబంపై చంద్రబాబు దుష్ఫ్రప్రచారం చేస్తున్నారు.వైయస్‌ కుటుంబం ఆస్తులును లాక్కునే రకం కాదు..ఆస్తులను పంచే కుటుంబం.వైయస్‌ఆర్‌ మాట ఇస్తే మాట తప్పరు.వైయస్‌ఆర్‌ కొడుకు వైయస్‌ జగన్‌ కూడా మాట ఇస్తే తప్పడు..సాధించి తీరతాడు.ప్రజలే తన కుటుంబంగా వైయస్‌ జగన్‌ భావించారు.వైయస్‌ జగన్‌ను సీఎం చేసుకుని మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందాం. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను బతికించుకుందాం..చంద్రబాబు గత తొమ్మిదేళ్లు..ఈ ఐదేళ్లు పాలన గుర్తుకుతెచ్చుకోమని అడుగుతున్నా..నలౖ¿ñ  సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పాడు..650 వాగ్ధానాలు చేసి వచ్చాడు.. నేడు ఎక్కడా అబద్ధం, మోసం,అవినీతి,అక్రమం ఇదే జరుగుతుందన్నారు.ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదు. పరిశ్రమలు రాలేదు. చంద్రబాబు నేడు ఏంచేశాటంటే..ఇసుక,మట్టి,బొగ్గు,దళిత భూములు,గుడి భూములు అన్నీ దోచుకుంటున్నారు.భూములనేది లేకుండా చేస్తున్నారు.సంవత్సరానికి మూడు పంటలు పండే పచ్చని పంటలను కూడా రాజధాని భూముల పేరుతో లాక్కున్నారు.మీ భవిష్యత్‌..మా భద్రత అని చంద్రబాబు చెబుతున్నాడు.మీ భవిష్యత్‌ ఇస్తున్నాడా అని అడుగుతున్నా..రైతుల రుణాలు మాఫీ చేయకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాడు.పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలేదు. బీమా లేదు.ప్రకృతి విపత్తులలో పరిహారం కూడా అందడంలేదు.డ్వాక్రా అక్కచెల్లెమ్మలను అడుగుతున్నా..మీకు రక్షణ,భద్రత ఉందా అని అడుగుతున్నా..మీ అప్పు తీరిందా అని అడుగుతున్నా..14వేల కోట్ల రూపాయలు నేడు 26వేల కోట్లు రూపాయలు అయ్యింది.వైయస్‌ఆర్‌ హయాంలో అక్కచెల్లెమ్మలకు లక్షాధికారులను చేయాలని చెప్పి  రివ్వాల్వింగ్ ఫండ్‌ ఇచ్చారు.

డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అన్నింట్లోనూ భాగస్వాముల్ని చేశారు.రేషన్‌కార్డులు,పాలకేంద్రాలు,గిరిజన ఉత్పత్తులపై భాగస్వాముల్ని చేశారు. చంద్రబాబు రోజుకో అబద్ధం..పూటకో మోసం చేస్తున్నాడు.ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం కట్టవలసిన వడ్డీ కట్టాడా అని అడుగుతున్నా..చంద్రబాబు పాలనలో మహిళలపై అఘాయిత్యాలు,వేధింపులు పెరిగిపోయాయి.  మన రాష్ట్రంలోనే మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని నేషనల్‌ క్రైం రిపోర్టు  చెబుతోంది.మహిళలపై నేరాల్లో దేశంలో మన రాష్ట్రంలో 8వ స్థానంలో ఉంది.మహిళలపై నేరాలకు పాల్పడేవారిలో తెలుగుదేశం నేతలు ఉంటున్నారు.చంద్రబాబు పాలనలో మహిళలకు ఏవిధంగా భద్రత కల్పిస్తున్నారని ప్రశ్నిస్తున్నా..నాగార్జున యూనివర్శిటీకి చెందిన రిషితేశ్వరి వేధింపులకు గురి అయి చనిపోతే..హంతుకులకు ప్రభుత్వం కొమ్ము కాస్తుంది. డా.సంధ్యారాణి,డా.సెల్వా వేధింపులతో చనిపోయారు. ఆ హంతకులకు కూడా ప్రభుత్వం కొమ్ము కాస్తోంది.

 చంద్రబాబును పెద్దన్న అని అన్నొచ్చా..కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో టీడీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు ఉన్నారు.. వారిని ప్రభుత్వం కాపాడుతుంది. తహసిల్దార్‌ వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని జుట్టు పట్టుకుని కొడితే చంద్రబాబు ఏం చేశారు..ఎవరికి రక్షణ లేదు.వైయస్‌ఆర్‌ హయాంలో మహిళలపై ఇలాంటివి జరిగితే చాలా కఠినంగా వ్యవహరించేవారు.మహిళలపై ఎంతో గౌరవం కలిగి ఉండేవారు.వైయస్‌ఆర్‌ హయాంలో ఆరుగురు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారు. హోంమినిస్టర్‌గా మహిళను నియమించారు.చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత లేదు.. అంగన్‌వాడీలను గు్రరాలతో తొక్కించేవాడు అన్న అవుతాడా..ఆశవర్కర్లపై లాఠీచార్జీ చేసేవాడు అన్న అవుతాడా..మధ్యాహ్న భోజన కార్మికులను మూడు రోజలు జైల్లో పెట్టించిన వాడు అన్న అవుతాడా..చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ అనేది లేదు.రెండు రూపాయలకు 20 లీటర్లు ఇస్తున్నాడా.బార్‌షాపులను రద్దు చేస్తానన్నాడు చేశాడా..నిరుద్యోగలకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా.. నిరుద్యోగ భృతి ఇస్తున్నాడా..ప్రభుత్వంలో రెండు లక్షల 30వేల ఉద్యోగాలు ఉన్నాయి భర్తీ చేశాడా..కనీసం నోటిఫికేష్‌ అయినా ఇచ్చాడా..ఆరోగ్యశ్రీ పడకేసింది.108,104 వస్తుందా..ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందా..ఏదీ రావడంలేదు.మెరిట్‌ విద్యార్థులు కూడా నేడు చదువుకోలేకపోతున్నారు.ప్రజా సంక్షేమం చంద్రబాబుకు పట్టడంలేదు. 

వ్యవసాయ ఆధారితమైన చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీపై 24వేల రైతులు,2వేల కార్మికులు, 2 లక్షల వ్యవసాయ కూలీలు ఆధారపడి బతుకున్నారు.45  కోట్ల నష్లాల్లో ఉన్న ఫ్యాక్టరీని ఆనాడు  వైయస్‌ఆర్‌ 45 కోట్ల లాభాల్లోకి  తీసుకువచ్చారు.నేడు చంద్రబాబు హయాంలో 100 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది.మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని లాభాల్లో నడిపిస్తామని హామీ ఇస్తున్నా.. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్‌ఆర్‌ భరోసా ద్వారా పంట వేసే సమయానికి మే నెలలో సంవత్సరానికి రూ.12వేలు పెటుబడి భరోసాగా మీ చేతులకే ఇస్తాం. పంట బీమా చేస్తాం. వడ్డీలేని పంట రుణాలు ఇస్తాం. రూ.3వేల కోట్లుతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రకృతి విపత్తుల సహాయనిధికి మరో 4వేల కోట్లు ఇస్తాం.రైతులందరికి ఉచిత బోర్లు,వ్యవసాయానికి పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత  విద్యుత్‌ ఇస్తాం.

ప్రమాదశాత్తు లేదా ఆత్మహత్య కారణంగా రైతు దూరమైతే ఆ కుటుంబానికి రూ.7లక్షలు పరిహారం ఇస్తాం ఆ డబ్బు అప్పులవాళ్లకు చెందకుండా చట్టం తీసుకువస్తాం.డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరుకు పొదుపు సంఘాల్లో మీకు అప్పు ఎంతైతే ఉందో ఆ మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా మీ చేతికి ఇస్తాం. సున్నావడ్డీకే రుణాలు ఇచ్చి బ్యాంకుల వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారీటీ అక్కలకు కార్పొరేషన్ల ద్వారా 75 వేలు దఫాలుగా వైయస్‌ఆర్‌ చేయత పథకం ద్వారా ఉచితంగా ఇస్తాం. అమ్మఒడి పథకం ద్వారా మీ  పిల్లలి బడికి పంపితే చాలు మీ చేతికే సంవత్సరానికి 15 వేలు ఇస్తాం.ఎల్‌కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా చదివిస్తాం. ఖాళీగా ఉన్న 2 లక్షల 30వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తాం. పతి ఏటా జనవరి 1న నోటిఫికేషన్ల  క్యాలెండర్‌ జారీ చేస్తాం.

మన ప్రభుత్వం రాగానే గ్రామ సచివాలయాల ద్వారా యువతకు గ్రామానికి 10 ఉద్యోగాలు. 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటిర్‌ ద్వారా ప్రభుత్వ పథకాలు మీ ఇంటికే అందేలా డోర్‌ డెలివరీ చేస్తాం. గ్రామ వాలంటిర్‌కు 5 వేలు గౌరవ వేతనం ఇస్తాం. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేస్తాం.దీని కోసం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతాం.వ్యవసాయ ట్రాక్టర్లకు ట్యాక్‌ రద్దు చేస్తాం.  అవ్వా,తాతలకు పింఛన్లు రూ.3వేలు పెంచుకుంటూ పోతాం.నవరత్నా పథకాలను ప్రతి ఇంటికి చేరాలనే ఆరాటంతో వైయస్‌ జగన్‌ ఉన్నారు. ఒకసారి వైయస్‌ఆర్‌ పాలనను అందరూ గుర్తుచేసుకోవాలి.వైయస్‌ జగన్‌ను సీఎం చేసుకుని రాజన్న రాజ్యం తెచ్చుకుందాం

 

Back to Top