నాన్న హత్యకేసు దర్యాప్తుపై అనుమానాలు

ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు కాపాడుతున్నారు..

పరమేశ్వర్‌–ఆదినారాయణ రెడ్డి సంబంధాలపై విచారణ ఎందుకు చేయడంలేదు

మా నాన్నది నలుగురికి సాయం చేసే వ్యక్తిత్వం

జగనన్నను సీఎం చేయాలన్నది  నాన్న కల

వైయస్‌ వివేకానందరెడ్డి కుమార్తె వైయస్‌ సునీతా 

హైదరాబాద్‌: మా నాన్న హత్యకేసు దర్యాప్తులో అనేక అనుమానాలు ఉన్నాయని వైయస్‌ వివేకానందరెడ్డి కుమార్తె వైయస్‌ సునీతారెడ్డి తెలిపారు.ఆమె హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు మా నాన్నది నలుగురికి సాయం చేసే వ్యక్తిత్వమని, బాధలో ఉంటే ఓదార్పు ఇచ్చే మనిషి అని, అలాంటి వ్యక్తి దారుణహత్యకు గురవడం మమల్ని తీవ్రంగా కలిచివేస్తుందన్నారు. నాన్న చనిపోయిన విషయం సిఐకు ఉదయం 6.40 గంటలకు తెలిపామని, మా నాన్న డెడ్‌బాడీ బాత్‌రూమ్‌లో ఉండగానే పోలీసులు వచ్చారన్నారు. కాని మా కుటుంబంపై దుష్ఫప్రచారం చేస్తున్నారన్నారు.హత్య కేసులో పరమేశ్వర్‌ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి  తీసుకున్నారు.. మార్చి14 వ తేదీ ఉదయం పరమేశ్వర్‌రెడ్డి ఆసుపత్రిలో చేరాడు.ఆసుపత్రిలో చేరగానే వివేకానందరెడ్డి తనకు సన్నిహితుడని చెప్పారు. అదేరోజు సాయంత్రం ఆసుపత్రిలో గొడవ చేసి డిశ్చార్జ్‌ అయ్యారు.

టీడీపీ కార్యకర్తలను హరితా హోటల్‌లో ఆయన కలిశారు. మళ్లీ అదే ఆసుపత్రిలో వచ్చి పరమేశ్వర్‌రెడ్డి అడ్మిట్‌ అవుతారు. తిరిగి రెండోరోజు తెల్లవారు జామున 4.30 గంటలకు ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి పరమేశ్వర్‌రెడ్డికి ఒక ఫోన్‌ చూపిస్తారు. తెల్లవారు జామున ఫోన్‌ చూపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.అక్కడ ఏం జరిగిందనే అనుమానాలు ఉన్నాయన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో ఆదినారాయణరెడ్డిని పరమేశ్వర్‌రెడ్డి కలిశారని తెలిపారన్నారు. వైయస్‌ అవినాష్‌ గెలుపు కోసం నాన్న  వైయస్‌ వివేకానందరెడ్డి కృషి చేస్తున్నారన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సీఎం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జగనన్నను సీఎం చేయాలన్నది నాన్న కల అని అన్నారు. మా నాన్న వివేకానందరెడ్డి 1970 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో  ఉన్నారన్నారు.

కడపలో ఉన్న ప్రతి స్థానిక నేత మా నాన్నకు తెలుసునన్నారు.గ్రామాల్లో ఉన్న ప్రతి చిన్న నేతతోనూ ఎప్పడూ టచ్‌లో ఉండేవారన్నారు.మా నాన్న ప్రజాదరణ ఏంటో ఆదినారాయణరెడ్డికి తెలుసునన్నారు.తన ఎంపీ నిధులు జమ్మలమడుగు కోసం ఖర్చుచేశారన్నారు.మా నాన్న ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి మేలు చేశారన్నారు.జమ్మలమడుగు నియోజకవర్గంలో మా నాన్నకు మంచి పేరు ఉందన్నారు.మా నాన్నకు చూసి ఆదినారాయణరెడ్డి భయపడ్డారన్నారు.ఎన్నికల్లో గెలవడానికి ఆదినారాయణ రెడ్డికి మా నాన్న అడ్డంకిగా కనిపించారన్నారు.మా నాన్నను అడ్డుతొలగిస్తేనే ఎన్నికల్లో గెలుస్తామని ఆదినారాయణరెడ్డి భావించారన్నారు. ఇదే విషయాన్ని పదేపదే సిట్‌కు వివరించానని తెలిపారు. చంద్రబాబు మా కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తున్నారని, ఎందుకు ఆదినారాయణరెడ్డికి రక్షణ కల్పిస్తున్నారని ప్రశ్నించారు. నాన్న దగ్గర ఉన్న ప్రతి ఒక్కరిని విచారణ చేస్తున్నారు తప్ప పరమేశ్వర్‌–ఆదినారాయణ రెడ్డి సంబంధాలపై ఎందుకు ఆరా తీయడం లేదని ప్రశ్నించారు.నాన్నతో ఉన్నవారిని అదుపులోకి తీసుకుని పదిరోజులైందని,మా కుటుంబసభ్యుల్ని అందరిని విచారణ చేస్తున్నప్పుడు ఎందుకు మేం లేవనెత్తిన ఆరోపణలపై విచారణ చేయరని ప్రశ్నించారు.మనిషిని పొగొట్టుకున్న మాపైనే నిందలు మోపడం సబబేనా అని ప్రశ్నించారు.

 

 

 

Back to Top