సమాన హక్కులు, న్యాయం, ఐక్యతే మ‌న బలం

 దేశప్రజలకు వైయ‌స్‌ జగన్‌ స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు 

తాడేప‌ల్లి: సమాన హక్కులు, న్యాయం, ఐక్యతే మన ప్రజాస్వామ్య దేశానికి నిజమైన బలంగా నిలుస్తాయని, ఈ విష‌యాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  దేశ ప్ర‌జ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో సందేశం పోస్టు చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు చేసుకుంటున్న సందర్భంలో.. సమాన హక్కులు, న్యాయం, ఐక్యతే మన ప్రజాస్వామ్య దేశానికి నిజమైన బలంగా నిలుస్తాయని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ప్రతి భారతీయుడికి గర్వభరిత స్వాతంత్య్ర  దినోత్సవ శుభాకాంక్షలు! అని వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Back to Top