తాడేపల్లి: ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు, ఎల్లుండి సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో ఇతరులను కలిసేందుకు అవకాశం లేదని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ జిల్లాకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ఇప్పటికే 5 నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో సమావేశం అయిన వైయస్ జగన్, మిగిలిన నియోజకవర్గాల నాయకులతో మంగళవారం, బుధవారం భేటీ అవుతారు. ఈ కారణం వల్ల ఇతర నాయకులు, సందర్శకులను ఆయన కలిసే అవకాశం ఉండదని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.