చిల్డ్రన్ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ శంకుస్థాపన

చికిత్స పొందిన చిన్నారులు, వారి తల్లిదండ్రులతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముఖాముఖి

 తిరుప‌తి: చిన్న పిల్లలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సంబంధించిన శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంత‌రం భూమి పూజలో పాల్గొన్నారు. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో రూ.300 కోట్ల వ్యయంతో దీనిని నిర్మిస్తున్నారు.  టాటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రూ.190 కోట్లతో 92 పడకల క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. ఏపీ ప్రభుత్వం, టీటీడీ సంపూర్ణ సహకారం అందించింది. అలాగే టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్‌ ఆస్పత్రిలో గ్రహణం మొర్రి, చెవుడు, మూగ రోగులకు సేవలందించే వార్డులను సీఎం ప్రారంభించారు. అనంతరం శ్రీ పద్మావతి కార్డియాక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన చిన్నారులు, వారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు.

Back to Top