బాబు పాలనలో ఉద్యోగాలు గోవిందా..

పెందుర్తి సభలో వైయస్ జగన్

పంచగ్రామ సమస్యను నా సమస్యగా భావిస్తాను

ఏ పరిశ్రమలోనైనా స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు

 చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు

 

పెందుర్తి: నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యింది. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు గోవిందా అని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. చంద్ర‌బాబు పాల‌న‌లో రైతులు, యువత, మహిళలు ఎవరైనా బాగుపడ్డారా? బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కానీ, బాబు పాలనలో ఉద్యోగాలన్నీ గోవిందా. 30 వేల మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా. 3,500 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల ఉద్యోగాలు గోవిందా. 1,000 మంది గోపాలమిత్రల ఉద్యోగాలు గోవిందా. ఆయుష్‌ శాఖలో 800 ఉద్యోగాలు గోవిందా. సాక్షర భారత్‌లో 30,000 ఉద్యోగాలు గోవిందా. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న 85,000 మంది అక్కచెల్లెమ్మల ఉద్యోగాలు గోవిందా. అంగన్‌వాడీలు, హోంగార్డులు, ఆశావర్కర్లు, వెలుగు సిబ్బంది జీతాలు పెంచమని కోరితే చంద్రబాబు తన పోలీసులతో కేసులు పెట్టించాడని మండిప‌డ్డారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పెందుర్తిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు.

నా పాదయాత్ర 3648 కిలోమీటర్లు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో పూర్తిచేశాను. పెందుర్తి నియోజకవర్గ సమస్యలను నా పాదయాత్రలో చెప్పారు. ఆ రోజు మీరు చెప్పిన ప్రతి సమస్య విన్నాను. మీ ప్రతి కష్టం నేను చూశాను, మీ ప్రతి బాధను నేను విన్నాను. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేనున్నానని హామీ ఇస్తున్నా.. ప్రజలకు మేలు చేయమని ఓట్లు వేస్తే నాయకులు ఏ విధంగా గద్దల్లా తయారై ప్రజల భూముల మీద కన్నేసి ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారో చూశారు. జె్రరిపోతులపాలెంలో దళిత మహిళను పాశవికంగా వివస్త్రను చేసి దాడి చేశారని ఈ నియోజకవర్గ ప్రజలు చెప్పిన మాట ఇవాల్టికి గుర్తుంది. ఇదే పంచగ్రామ సమస్య గురించి చెప్పారు. పంచగ్రామ సమస్యల గురించి ఎన్నికలు వచ్చిప్పుడల్లా చంద్రబాబు ప్రతి సందర్భంలో చెప్పగడం, తరువాత ఎగరగొట్టడం, అదేదో చేస్తున్నట్లుగా భ్రమ కల్పించడం చేస్తున్నాడు. 

పంచగ్రామ సమస్యను నా సమస్యగా భావిస్తాను. గుడి పెద్దలతో మాట్లాడి, వారికి నష్టం జరగకుండా పరిష్కారం చూపుతూ.. ఇప్పటికే ఆ భూములపై ఆధారిపడిన ప్రతి ఒక్కరికీ పట్టాలు ఇప్పిస్తానని మాటిస్తున్నా. ఎన్టీపీసీ, ఫార్మాసిటీ ఇటువంటి కాలుష్యానికి లోనై తాడి, పిట్లవాణిపాలెం గ్రామాలకు చెందిన ప్రజలను తరలించని పరిస్థితుల్లో కాలుష్యానికి గురై జీవనం గడుపుతున్న అక్కచెల్లెమ్మలు వచ్చి చెప్పిన బాధ గుర్తుంది. అధికారంలోకి వచ్చిన తరువాత తరలించే కార్యక్రమం చేస్తామని, సరైన పరిహారం కూడా ఇస్తామని పాదయాత్రలోనే చెప్పాను. ఇదే నియోజకవర్గంలో థరవాడ ఫార్మాసిటీ, వెక్టెజ్‌ జోన్‌ ఉంది, వాటి పక్కనే అచ్చుతాపురానికి చెందిన ఎస్సీజెడ్‌లు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా స్థానికులకు ఉద్యోగాలు లేవు,  ఈ పద్ధతి మారాలి. మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి శాసనసభలోనే చట్టం తీసుకువస్తాం. ఏ పరిశ్రమలోనైనా స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తీసుకువస్తాం. మీ అందరికీ నేనున్నానని భరోసా ఇస్తున్నా. 

ఎన్నికలు జరగుతున్నాయి. 20 రోజులుగా జరుగుతున్న కుట్రలు, మోసాలు చూస్తున్నారు. ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో మనమంతా చూసింది మోసం ఒక్కటే. ఈ రోజు కూడా గత 20 రోజులుగా జరుగుతున్న కుట్రలు చూస్తే చంద్రబబు పాలనపై ప్రజల్లో చర్చ జరగకూడదని రోజుకో డ్రామాకు, మోసానికి తెర లేపుతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వంపై చర్చ జరిగితే.. చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని తెలుసు. కుట్రలు గమనించండి, మోసాన్ని చూడండి, అబద్ధాలు గమనించండి. ఈ రోజు ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9తో యుద్ధం చేస్తున్నాం. కచ్చితంగా ఈ విషయాలను గుర్తుపెట్టుకోమని కోరుతున్నా.. గత 20 రోజులుగా మీరు చూస్తున్నారు. మరో 11 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఇక మీదట కుట్రలు ఎక్కువవుతాయి. ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చూపిస్తారు. రోజుకో డ్రామా, రోజుకో సినిమా కూడా చూపిస్తారు. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి కుట్రలో భాగంగా గ్రామాలకు మూటల మూటల డబ్బులు పంపిస్తాడు. ప్రతి చేతిలోను రూ. 3 వేలు పెట్టే కార్యక్రమం చేస్తాడు. మీరంతా గ్రామాల్లో ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను, ప్రతి అన్నను, ప్రతి అవ్వాతాతను కలిసి చెప్పండి. 

చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలు తీసుకొని మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్ను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు అన్న ప్రతి అక్క చేతిలో రూ. 15 వేలు పెడతాడని చెప్పండి. మన పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చదివించగలుగుతున్నామా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదు అక్కా.. పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నాం.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను పెద్ద చదువులు ఎన్ని లక్షలు ఖర్చు అయినా అన్న ఉచితంగా చదివిస్తాడని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. 

పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అని చెప్పండి. ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. ఒక్క రూపాయి మాఫీ చేసిన పరిస్థితి లేదు. గతంలో మనకు సున్నావడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత సున్నావడ్డీ ఎగరగొట్టాడు. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఉన్న రుణాలన్నీ మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాడని ప్రతి అక్కకు, ప్రతిచెల్లెమ్మకు చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకి రుణాలు వచ్చేది జగనన్నతోనే సాధ్యమని చెప్పండి.

పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 

గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. 20 రోజులు ఓపికపట్టు అన్న.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబడుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు..  గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 

అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. పెన్షన్‌ వచ్చేది కాదని, లేకపోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. 20 రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 

ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఇల్లు లేదు. కట్టిస్తానన్న మాట పోయింది. 20 రోజులు ఓపిక పట్టు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అక్షరాల 25 లక్షల ఇళ్లులు కట్టిస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యంలో ఇళ్లులు కట్టడం చూశాం. మళ్లీ జగనన్నతోనే అది సాధ్యమని ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి.

నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి కుటుంబంలోకి తీసుకొనిపోండి. నవరత్నాలతో మన బతుకులు మారుతాయి. మన ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో ఆనందం చూడవచ్చని గట్టిగానమ్ముతున్నా.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పురావాలి. రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానా చేస్తానని చెబితే.. మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తరువాత ఇచ్చిన హామీ అమలు చేయకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అదీప్‌ను నిలబెడుతున్నాను.. యువకుడు, ఉత్సాహవంతుడు మంచిచేస్తాడని నమ్మకం ఉంది. మీ ఎంపీ అభ్యర్థిగా సత్యవతి అమ్మను నిలబెడుతున్నాను. డాక్టర్, మంచిపేరు ఉంది. వీరిద్దరి ఆశీర్వదించాలని పేరు పేరునా విజ్ఞప్తి చేస్తున్నాను. చివరకు మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు. 
 

Back to Top