పేదరికానికి కులం, మతం ఉండదు

ఈబీసీ నేస్తం కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

మాది మ‌హిళ‌ పక్షపాతి ప్రభుత్వం

చిరునవ్వుతో కుటుంబాన్ని నడిపిస్తున్న గొప్ప వ్యక్తులు మహిళలు

అక్కచెల్లెమ్మలకు సెల్యూట్‌ చేస్తున్నా

మహిళల సాధికారత కోసం అనేక పథకాలు

ఓసీ వర్గాల్లోని అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్నదే నా లక్ష్యం

ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఎన్నికల ముందు చెప్పిన పథకాలు కావు

మహిళలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం

46 నెలల్లో రూ.2.07 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారులకు అందించాం

రూ. లక్షా 42 వేల కోట్లు మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేశాం

గత ప్రభుత్వంలో ఇలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయా?

గతంలో డీపీటీ పథకం ఉండేది

సెల్ఫీ ఛాలెంజ్‌ అంటే నాలుగు ఫేక్‌ ఫోటోలు కాదు బాబు

ప్రతి పేద ఇంటి ముందు నిలబడి ఈ పథకం అందిందని చెబితే అది సెల్ఫీ అంటారు

2014–2019 మధ్య ఇంటింటికి ఎంత మంచి జరిగింది..ఇప్పుడు ఎంత మంచి 
జరిగిందో బేరీజు వేసుకోండి

ముసలాయన పాలనలో ఒక్క రూపాయి  అయినా మీ ఖాతాల్లో జమ అయిందా?

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అబద్ధాల బ్యాచ్‌ను నమ్మకండి

వైయ‌స్ఆర్‌ ఈబీసీ నేస్తం కింద రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని మ‌హిళ‌ల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

 మార్కాపురం:  పేదరికానికి కులం, మతం ఉండదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మీ బిడ్డ ప్ర‌భుత్వం మహిళల సాధికారిత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింద‌ని చెప్పారు.  మహిళలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఎన్నికల ముందు చెప్పిన పథకాలు కావ‌న్నారు.  ఒక్కో ఇంటి విలువ సుమారు రూ.10 లక్షలు. ప్రతీ మహిళను సమయానికి ఆదుకుంటున్నామ‌ని చెప్పారు.  మహిళలకు 50 శాతం. రిజర్వేషన్‌పై చట్టం చేశామ‌ని, మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాల‌ని సీఎం పేర్కొన్నారు.ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని తీసుకున్నా.. ఏ గ్రామాన్ని తీసుకున్నా… ఏ జిల్లాను తీసుకున్నా… గత ప్రభుత్వంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత? ఈ ప్రభుత్వం హయాంలో జరిగిన మంచి ఎంత? బేరీజు వేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉందా? అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఛాలెంజ్‌ విసిరారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 చూసినా.. ఒకే అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేసి.. నిజాన్ని నమ్మించే ప్రయత్నంచేస్తున్నారు. ఈ అబద్ధాలను బ్యాచ్‌ను ఎక్కడికక్కడ ప్రశ్నించండి. గత ఐదేళ్ల హయాంలో ఇక్క ఇళ్లస్థలమైనా ఎందుకు ఇవ్వలేకపోయారు. మనం ఇచ్చిన 30 లక్షల ఇళ్లపట్టాల విషయాన్ని చెప్పండి. అలాంటి ఇళ్లస్థలాలముందు సెల్ఫీ దిగే నైతికత ఉందా?. అయ్యా చంద్రబాబు ఏ మంచి చేశావని… మా ఇంటిముందు స్టిక్కర్‌ వేస్తానంఉన్నావు అని ప్రశ్నించండి అని సీఎం వైయ‌స్‌ జగన్ పిలుపునిచ్చారు.  రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైయ‌స్ఆర్‌ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని బుధవారం విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో  జమ చేశారు.

 •  ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:
  ఎండలు తీవ్రంగా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చిక్కటి చిరునవ్వులతో చెరగని ఆత్మీయతలు పంచిపెడుతున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతలకు, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు దేవుడిదయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

  ప్రతి అక్కచెల్లెమ్మ చరిత్ర కూడా గొప్పదే
  దాదాపుగా 4.39 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ.. నేరుగా బటన్‌ నొక్కి వారి ఖాతాల్లోకి రూ.659 కోట్లు జమ చేస్తున్నాం. 
  ఇది అక్కచెల్లెమ్మలకు మరింత సాధికారత ఇచ్చే కార్యక్రమం. ఇంటి దీపాలైన అక్కచెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి. మామూలుగా సత్కారాలు చేస్తుంటాం. ఆలా చేసేటప్పుడు గొప్పవాళ్ల జీవితాలను చూసి.. వాళ్ల జీవితచరిత్రలు మాత్రమే గొప్పవని సత్కారాలు చేస్తాం. కానీ నేను ఇవాళ ఒక్కటి చెబుతున్నాను. ఆ గొప్పవాళ్ల జీవిత చరిత్రలు మాత్రమే గొప్పవి కావు.. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మ చరిత్ర కూడా అంతే గొప్పది. కారణం ఆ అక్క, ఆ చెల్లెమ్మ వాళ్ల నిత్య జీవితాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఆ కుటంబాన్ని నడిపించే గొప్ప బాధ్యత ఆ అక్కచెల్లెమ్మలు చిరునవ్వుతో చేస్తారు కాబట్టి ఆ  ప్రతి అక్కచెల్లెమ్మకు ఈ సందర్భంగా ఈ రోజు సెల్యూట్‌ చేస్తున్నాను.

  దేవుడి దయతో ఈ 46 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలకు అందరికీ మంచి చేసే అనేక అడుగులు మీ బిడ్డ ప్రభుత్వం వేసింది. తల్లి గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి మొదలు 60 నుంచి 100 సంవత్సరాల వయస్సులో ఉన్న అవ్వల వరకూ అందరికీ మంచి చేశాం. సంపూర్ణ పోషణంతో మొదలుపెట్టి వృద్ధ్యాప్య ఫించన్‌ వరకు అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం.

  ప్రతి రూపాయి కుటుంబం కోసమే...
  ఈ రోజు చేస్తున్న కార్యక్రమం కూడా అలాంటిదే. 45 నుంచి 60 సంవత్సరాలమధ్య అత్యంత బాధ్యతాయుతమైన వయస్సులో ఉన్న అక్కచెల్లెమ్మలు అందరికీ కూడా చేతిలో రూపాయి డబ్బులు పెడితే అలా పెట్టిన ప్రతి రూపాయిని ఆ అక్కచెల్లెమ్మ తన కుటుంబం బాగోగుల కోసమే ఖర్చుపెడుతుందని ధృడంగా నమ్మాను. ఈ రోజు అలాంటి అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. 
  ఇంతకముందు 45 నుంచి 60 సంవత్సరాల వయస్సులో ఉన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకు వైయస్సార్‌ చేయూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వాళ్ల కాళ్లమీద వాళ్లను నిలబెట్టేందుకు వైయస్సార్‌ చేయూత కార్యక్రమానికి అడుగులు వేశాం. అంతటితో ఆగిపోకుండా కాపు అక్కచెల్లెమ్మల కోసం వైయస్సార్‌ కాపునేస్తం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ వర్గాలతో పాటు ఓసీ వర్గాల్లో ఉన్న పేద అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. పేదరికానికి కులం ఉండదు. పేదరికానికి మతం ఉండదు. పేదరికంలో ఉన్న ప్రతి అక్క, చెల్లెకు తోడుగా నిలబడాలని ఓసీ వర్గాల పేద అక్కచెల్లెమ్లకు తోడుగా ఉండేందుకు వైయస్సార్‌ ఈబీసీ నేస్తం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

  45–60 సంవత్సరాల వయసులో ఉన్న ఓసీ వర్గాలకు చెందిన రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, వెలమ, బ్రాహ్మణ తదితర కులాల్లో ఉన్న ఓసీ వర్గాల్లో ఉన్న పేద అక్కచెల్లెమ్మలకు మేలు జరగాలని, వాళ్ల కాళ్లుమీద వాళ్లు నిలబడాలని, నిలదొక్కుకోవాలని మహిళా పక్షపాత ప్రభుత్వంగా వాళ్లకు మంచి చేస్తూ వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 4,39,068 మంది అక్కచెల్లెమ్మలకు రూ.659 కోట్లను వారి అకౌంట్లో జమ చేస్తున్నాం.

  రెండేళ్లలో రూ.1258 కోట్లు- ఈబీసీ నేస్తం 
  ఈ రెండు సంవత్సరాల కాలంలోనే వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా పేద అక్కచెల్లెమ్మలకు రూ.1258 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేశాం. ప్రతి అక్క, చెల్లెమ్మ ఇవాల్టితో రెండోదఫా డబ్బులు అందుకున్నట్టవుతుంది. 
  దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏప్రభుత్వమూ చేయడం లేదు. మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే చేస్తుంది.

  నా అక్కచెల్లెమ్మలందరూ ఆర్ధికంగా బాగుపడాలని, వాళ్ల కాలుమీద వాళ్లు నిలబడాలని, రాజకీయంగా పైకి రావాలని, సామాజికంగా, విద్యాపరంగా సాధికారతను సాధించాలని వారి ఆత్మ గౌరవం పెంచాలని ఈ 46 నెలల కాలంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారంచుట్టాం.

  అమ్మఒడి మొదలు ఆసరా వరకూ..
  అమ్మఒడి పథకం నుంచి మొదలుపెడితే, 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ వరకూ,  అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ సున్నావడ్డీ, వైయస్సార్‌ కాపునేస్తం, వైయస్సార్‌ ఈబీసీ నేస్తం, విద్యాదీవెన, వసతి దీవెన, షాదీతోఫా–కళ్యాణమస్తు, విదేశీ విద్యాదీవెన వంటి అనేక పథకాలు నా అక్కచెల్లెమ్మలకు ఉపయోగపడాలని వారికి అండగా, తోడుగా ఉంటూ మహిళా పక్షపాత ప్రభుత్వంగా మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ 46 నెలల కాలంలో ఇది జరిగింది.

  మేనిఫెస్టోలో పెట్టకున్నా...
  నిజానికి ఈ ఈబీసీ నేస్తం, కాపునేస్తం పథకాలు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో పెట్టలేదు. అప్పుడు చెప్పలేదు అయినా కూడా ఓసీల్లోని అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని, వారు కూడా పేదరికం నుంచి బయటపడేటట్టు అడుగులు వేయాలని, వారికి తోడుగా ఉండాలని, పేదరికానికి చికిత్స చేయాలన్న తపన, తాపత్రయంతో ఈ పధకాలు అమలు చేస్తున్నాం.
  అక్కచెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వంగా ఈ 46 నెలల కాలంలోనే ఇప్పటికే రూ.2.07 లక్షల కోట్లు బటన్‌ నొక్కి డీబీటీ ద్వారా పేదవాడి ఖాతాల్లోకి వెళ్లింది. దీనిలో రూ.1.42 లక్షల కోట్లు ఈ 46 నెలల్లో నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పోయింది. వివక్ష, లంచాలు లేకుండా జమ చే శాం.

  వైయస్సార్‌ చేయూత ద్వారా ఇప్పటికే 26,39,703 మంది అక్కచెల్లెమ్మలకు రూ.14,129 కోట్లు వారి ఖాతాల్లోకి జమ చేయగలిగాం. వైయస్సార్‌ కాపు నేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1518 కోట్లు ఆర్దిక సాయం చేశాం. ఒక్క వైయస్సార్‌ పెన్షన్‌ కానుక ద్వారా 41.77 లక్షల మంది వితంతువులు, అవ్వలు, దివ్యాంగ మహిళలకు అందించిన లబ్ధి రూ.40,094 కోట్లు. 
  అమ్మఒఢి ద్వారా 44.48 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.19,674 కోట్లు జమ చేశాం.  వైయస్సార్‌ ఆసరా ద్వారా ఎన్నికల నాటికి స్వయం సహాయక సంఘాల్లో అక్కచెల్లెమ్మలకు ఉన్న రూ.25,571 కోట్ల అప్పు పేరుకుపోయి ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌ లో ఉన్న సంఘాలన్నీ సీ, డీ గ్రేడులగా దిగజారిపోయి, బ్యాంకులకు కట్టాల్సిన రుణాలు కట్టలేక ఎన్‌పీఏలు, అవుట్‌ స్టాండింగ్‌లు కింద 18శాతం అక్కచెల్లెమ్మలందరూ విలవిల్లాడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు విడతల్లో ఆ అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తాం అని మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం 78.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఆసరా పథకం ద్వారా రూ.19,178 కోట్లు వారి ఖాతాల్లోకి వేశాం. 

  జగనన్న కాలనీలు
  వైయస్సార్‌ జగనన్న కాలనీల ద్వారా ఏకంగా 30 లక్షల ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాం. అందులో 22 లక్షల ఇళ్లు ఇప్పటికే వారి పేరుతో కడుతున్నాం. ఇవి పూర్తయితే ఒక్కో ఇంటి విలువ రూ.5 నుంచి రూ.10 లక్షలు  ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో పెట్టినట్టవుతుంది. 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ.. ఒక్కొక్కరి చేతిలో రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల చొప్పున లెక్కిస్తే.. ఏకంగా వారి చేతుల్లో రూ.2లక్షల నుంచి రూ.3లక్షల కోట్లు వారి చేతుల్లో పెట్టినట్లవుతుంది. పొదుపు సంఘాలలో ఉన్న అక్కచెల్లెమ్మలకు సున్నావడ్డీ కింద రూ. 3,615 కోట్లు ప్రతిసంవత్సరం క్రమం తప్పకుండా ప్రతి అక్కనూ, చెల్లెమ్మనూ సమయానికి ఆదుకుంటూ దాదాపుగా 1.02 కోట్ల మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తున్నాం. 

  విద్యాదీవెన ద్వారా
  పిల్లల పెద్ద చదువులుకు అయ్యే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విద్యాదీ భరించడమే కాకుండా ఆ తల్లుల ఖాతాల్లోకి వసతి దీవెన కింద ఆ పిల్లల బోర్డింగ్, లాడ్జింగ్‌ ఖర్చుల కోసం మరో రూ.20వేలు ఆర్దిక సహాయం చేస్తూ.. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకానికి రూ.13,351 కోట్లు ఖర్చు చేశాం. 
  సంపూర్ణ పోషణం ద్వారా మరో 35 లక్షల మంది బాలింతలు, గర్బిణీలు, 6 నుంచి 72 నెలల చిన్నారులకు మంచి చేస్తూ రూ.6131 కోట్లు ఖర్చు చేశాం.

  అక్కచెల్లెమ్మలకు అండగా - దిశ
  అక్కచెల్లెమ్మల ప్రభుత్వంగా నా అక్కచెల్లెమ్మలు ఎక్కడికైనా, ఎప్పుడైనా వెళ్లేటప్పుడు భయపడే పరిస్థితి ఉండకూడదని దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్‌ గురించి ఆలోచన చేశాం. దిశ యాప్‌ను అక్కచెల్లెమ్మల ఫోన్‌లలోకి తీసుకొచ్చాం. 1.17 కోట్లమంది అక్కచెల్లెమ్మల దిశయాప్‌ను వారి ఫోన్లలో డౌన్లోడ్‌ చేసుకున్నారు. వారికి ఏ ఆపద వచ్చినా వెంటనే ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా లేదా ఆ ఫోన్‌ను 5 సార్లు గట్టిగా ఊపితే చాలు.. వారికి వెంటనే ఫోన్‌ వస్తుంది. పది నిమిషాల్లో పోలీసు సోదరుడు అక్కడకు వచ్చి చెల్లమ్మా నీకు ఏమైంది అని అడిగే గొప్ప పరిస్థితి దేశంలో మన రాష్ట్రంలో తప్ప మరెక్కడా లేదు. ఇటువంటి ఆలోచనలు  మనసుపెట్టి చేయగలిగాం. గతంలో ఇక్కడా లేవు. మిగతా రాష్ట్రాలన్నీ మన రాష్ట్రానికి వచ్చికాపీ కొట్టి.. ఇక్కడ ఎలా జరుగుతుందో చూసుకుని పోయి అక్కడ చేయాలని తపన పడే పరిస్థితి ఉంది. 

  నామినేటెడ్‌, నామినేషన్ పదవుల్లో 50 శాతం
  నా అక్కచెల్లెమ్మలు గొప్పగా ఎదగాలని వారి కోసం  నామినేటెడ్‌గా ఇచ్చే పదవుల్లో 50 శాతం కచ్చితంగా రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టమే చేశాం. వారికి మంచి జరగాలని వేగంగా అడుగులు వేస్తూ.. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం అక్కచెల్లెమ్మలకు వచ్చేలా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ప్రతి మహిళా విద్యాపరంగా, సామాజికంగాను, ఆర్ధికంగాను, రాజకీయంగా ఎదగాలని 21 శతాబ్ధపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటినుంచి రావాలని తపన, తాపత్రయంలో 46 నెలల పాలన సాగించాం.
   నేను ఇవాళ చెప్పిన అన్నింటిపైనా ఒక్కసారి ఆలోచన చేయండి. నేను చెప్పినవన్నీ ఇవాళ మీ జీవితాల్లో జరుగుతున్నాయి. అవే చెప్పాను. 

  మరికొన్ని విషయాలను మీతో పంచుకుంటాను.

  ఈ రాష్ట్రంలో 1.56 కోట్ల కుటుంబాలను ఆలోచన చేయమని మీ జగన్‌గా అడుగుతున్నాను. ప్రతి అన్ననూ, ప్రతి అక్కనూ, చెల్లెమ్మను అడుగుతున్నాను. మీకు గత నాలుగేళ్ల పాలనలో ఎక్కడైనా లంచాలు, వివక్షకు చోటు లేకుండా డీబీటీ ద్వారా నేరుగా బటన్‌ నొక్కి మీ ఖాతాల్లోకి ఇంటింటికీ ఎంత మంచి చేశామో మీ అందరికీ తెలుసు. గుర్తుకుతెచ్చుకొండి. ఒక్క డీబీటీ ద్వారానే 46 నెలల కాలంలో ఏకంగా రూ.2.07 లక్షల కోట్ల నా అక్కచెల్లెమ్మల కుటుంబసభ్యుల ఖాతాల్లోకి నేరుగా బటన్‌ నొక్కి జమ చేశాం.

  గత ప్రభుత్వంలో 2014–19 మధ్య అప్పట్లో ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు. ఈ పథకాలుండేవా ? ఈ బటన్‌ నొక్కే డిబీటీ పద్ధతి ఉండేదా ? ఆ రోజు ఉన్నదల్లా డీపీటీ( దోచుకో, పంచుకో, తినుకో) మాత్రమే. అక్కచెల్లెమ్మలందరూ ఆలోచన చేయండి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు ఎంత మందికి బ్యాంకు అకౌంట్లు ఉంటే అందులో బాబు తన ఐదు సంవత్సరాల పాలనలో డీబీటీ ద్వారా మీ అకౌంట్లలోనికి ఎంత డబ్బు వేశాడన్నది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొండి ? 
  అదే మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బ్యాంకు అకౌంట్లలోనికి మీ పాత బాకీలకు ఏ బ్యాంకులు జమ చేసుకోలేని విధంగా, అన్‌ ఇన్‌కంబర్డ్‌ అకౌంట్లుగా మార్చి అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, చేయూత, కాపునేస్తంతో పాటు ఇవాళ విడుదల చేస్తున్న ఈబీసీ నేస్తం, ఆసరా, రైతన్నల ఖాతాల్లో వేసే రైతు భరోసా, మత్స్యకార సోదరులకి ఇచ్చే మత్స్య కార భరోసా, నేతన్న నేస్తం, వాహనమిత్ర ఇలా చెప్పుకుంటూ పోయే ఇన్ని పథకాల ద్వారా నేరుగా మీ ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా మీ ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయా ? లేదా ?ఆలోచన చేయండి. లేడా గమనించండి. 

  బాబు హయాంలో రూ.1 కూడా ఇవ్వలేదు...
  అదే చంద్రబాబునాయుడు హయాంలో ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లోకి వేశాడా ? మరి జగన్‌ ఈ పథకాలన్నీ ఎలా ఇవ్వగలగుతున్నాడో ఆలోచన చేయండి.  మీ బిడ్డ ఇన్నిపథకాలు ఇవ్వగలుగుతుంటే.. బాబు పాలనలో ఎందుకు లేవు? బటన్‌ నొక్కే కార్యక్రమం ఎందుకు జరగలేదు ? డబ్బులు మీ ఖాతాల్లోకి ఎందుకు రాలేదో ఆలోచన చేయండి. అదే ఈ 46 నెలల కాలంలో మీకు ఇచ్చింది రూ.2.07 లక్షల కోట్లు.
  మరి ఈ డబ్బంతా ఆ ముసలాయన చంద్రబాబు పాలనలో ఎవరు దోచుకున్నారు? ఎవరు పంచుకున్నారు ? ఎవరు తిన్నారు ? ఆలోచించండి.

  బాబు ఫేక్ ఫోటోలు...
  ఇలాంటి విషయాలన్నీ మాట్లాడాల్సివచ్చినప్పుడు ఆ ముసలాయన మాట్లాడడు. కానీ నాలుగు ఫేక్‌ ఫోటోలు మాత్రం దిగుతాడు. తాను కట్టకుండా వదిలేసిన టిడ్కో ఇళ్లు దగ్గర వెళ్లి....  మీ బిడ్డ హయాంలో వాటిని పూర్తిగా కట్టి వేగంగా పనులు జరుగుతున్న చోటుకి వెళ్లి సెల్ఫీ ఫోటోలు దిగుతాడు. 

  దిగడమే కాకుండా సెల్ఫీ ఛాలెంజ్‌ అంటాడు. అయ్యా బాబుగారు సెల్ఫీ ఛాలెంజ్‌ అంటే నాలుగు ఫేక్‌ ఫోటోలు కాదు. ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ప్రతి పేదవాడి ఇంటి ముందు నిలబడి.. ఈ ఇంటికి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇదీ అని చెప్పగలిగితే, ఆ అక్కచెల్లెమ్మలు చిరునవ్వుతో ఆశీర్వదించగలిగితే దాన్ని గొప్ప సెల్ఫీ అంటారు. 

  ఏ పేద కుుటంబాన్ని తీసుకున్నా..
  ఈ రాష్ట్రంలో ఏపేద కుటుంబాన్ని తీసుకున్నా నేను గర్వంగా చెప్తున్నాను.  ఏ గ్రామాన్ని, ఏ జిల్లాను తీసుకున్నా 2014–19లో, గత ప్రభుత్వంలోఇంటింటికీ జరిగిన మంచి ఎంత? ఈ నాలుగు సంవత్సరాల కాలంలో 2019–23 మధ్య మన ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి, ప్రతి ప్రాంతానికి జరిగిన మంచి ఎంత అని బేరీజు వేసుకునే సత్తా మీకు ఉందా బాబు అని అడుగుతున్నాను. ఇదీ ఛాలెంజ్‌ ? 

  ప్రజలకు నిజాలు తెలుసు
  ఈ నిజాలు ప్రజలకు తెలుసు. ఇంటింటికీ తెలుసు. మనిషి మనిషికీ ఈ నిజాలు తెలుసు. కాబట్టే నిజాలు దాస్తున్నారు. నిందలు అబద్దాలతో ప్రచారాలకి దిగుతున్నారు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినా, టీవీ5 చూసినా ఒక అబద్దాన్ని వందసార్లు చెప్పి అదే నిజమని ప్రజలను నమ్మించే దిక్కుమాలిన ఆలోచనలు జరుగుతున్నాయి.
  ఇలాంటి అబద్దాల బ్యాచ్‌ని నమ్మకండి. అబద్దాలు చెప్పేవారిని రివర్స్ మీరు అడగండి. వారి ఐదేళ్ల గత పాలనలో ఒక్క ఇళ్ల స్ధలం కూడా ఇవ్వని, ఇవ్వలేని చంద్రబాబుకు, మన ప్రభుత్వంలో ఇచ్చిన 30 లక్షల ఇంటి స్ధలాలు అందులో కడుతున్న ఇళ్లు ముందు నిలబడి సెల్భీ దిగే నైతికత, స్టిక్కర్‌ ఇంటిమీద అంటించే అర్హత కానీ బాబూ మీకు ఉందా అని గట్టిగా నిలదీసి అడగండి. 

  గట్టిగా నిలదీయండి
  అయ్యా చంద్రబాబు ఏ మంచి చేశావని మా ఇంటి మీద స్టిక్కర్‌ వేస్తానంటున్నావు అని గట్టిగా నిలదీస్తూ అడగండి. మనందరి ప్రభుత్వంలో అమ్మఒడి ద్వారా 45 లక్షల తల్లులకు 84 లక్షల మంది పిల్లలకు మంచి జరిగింది. ఆమ్మఒడి అందుకున్న ఆ 45 లక్షల ఇళ్లల్లోని అక్కచెల్లెమ్మలు మీరు చంద్రబాబుని అడగండి? మా ఇంటి ముందు సెల్ఫీ దిగే నైతికత, స్టిక్కర్‌ అంటించే అర్హత నీకు ఉందా బాబూ అంటూ నిలదీసి అడగండి. 

  రైతు భరోసా కింద 53 లక్షల మంది రైతన్నలకుటుంబాలకు వరుసగా నాలుగేళ్లగా ప్రతియేటా రూ.13,500 రైతుల ఖాతాల్లోకి అందించాం. రైతన్నలందరూ అడగండి అని కోరుతున్నాను.

  గతం ఒక్కసారి గుర్తు చేసుకొండి.
  భేషరతుగా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబుని అడగండి. రైతు భరోసా అందుకుంటున్న 53 లక్షల రైతన్నల కుటుంబాలను కోరుతున్నాను.అయ్యా  చంద్రబాబూ రుణమాఫీ చేస్తానని మోసం చేశావు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి ఇప్పిస్తానని మోసం చేశావు. చివరికి సున్నావడ్డీ పథకాన్ని ఎగరగొట్టావ్‌. మమ్నల్ని రోడ్లమీద నిలబెట్టావ్‌. ఇటువంటి మనిషివి నువ్వు మా ఇంటిముందు నిలబడి స్టిక్కర్‌ అంటించే అర్హత కానీ, సెల్ఫీ దిగే నైతికత కానీ నీకు ఉందా బాబూ అని గట్టిగా నిలదీసి అడగండి.

  కోటికి పైగా ఉన్న పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలందరినీ అడుగుతున్నాను. ఈ మోసాల బాబును అడగండి. ఆ రోజు జ్ఞాపకం తెచ్చుకొండి. మొదటి సంతకంతో డ్వాక్రారుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి పచ్చి మోసం చేశాడు. పొదుపు సంఘాల రుణాల మాఫీ మాట దేవుడెరుగు. అంతవరకు ఇస్తున్న సున్నావడ్డీ పథకాన్ని ఎగురగొట్టాడు. ఇటువంటి పనులు చేసిన  ఈ బాబును అక్కచెల్లెమ్మలంతా అడగండి. ఇంత మోసం చేసిన నీకు మా ఇంటిదగ్గరకొచ్చి మాతో సెల్ఫీ దిగే నైతికత కానీ, మా ఇంంటిమీద స్టిక్కర్‌ అంటించే అర్హత కానీ ఉందా బాబు అని అడగండి. 
  45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నా కాపు, ఈబీసీ అక్కచెల్లెమ్మలలో పేదవాళ్లుగా ఉన్న వారందరూ అడగండి. 
  మా జగనన్న ప్రభుత్వం  వైయస్సార్‌ కాపునేస్తం, ఈబీసీ నేస్తం అనేక పథకాలు ఇచ్చాడు. ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు నీ పాలనలో ఎక్కడికి పోయాయి?. ఎవరు తిన్నారు ? అని గట్టిగా అడగండి. గవర్నమెంటు బడి గురించి ఎప్పుడైనా ఆలోచించావా చంద్రబాబూ అని అడగండి. ఆ బడి పిల్లలు మధ్యాహ్న బోజనం ఏం తింటున్నారు? ఆ తిండి ఎలా ఉందని ఏ రోజన్నా మనసుపెట్టి ఆలోచించావా ? అని గట్టిగా అడగండి. 

  8వతరగతి పిల్లలకు ట్యాబులు, 6వతరగతి నుంచి ప్రతి క్లాస్‌ రూమ్‌లో డిజిటల్‌ బోధన కోసం ఐఎఫ్‌పీ ప్యానెల్స్, గవర్నమెంటు బడుల్లో ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, టెక్ట్స్‌బుక్స్‌ కూడా ఒక పేజీ ఇంగ్లిషు, మరో పేజీలో తెలుగుతో బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ ఇస్తున్నాం. పెద్ద చదువులు సైతం పేదవాడికి దూరం కాకూడదని వందశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇది కాక వసతి దీవెన ఇలాంటి ఆలోచనలు నీకు ఎప్పుడైనా తట్టాయా అని ఇదే చంద్రబాబును నిలదీసి అడగండి.

  పెన్షన్‌ తీసుకుంటున్న అవ్వలు, నా దివ్యాంగ అక్కలు, వితంతు అక్కచెల్లెమ్మలు మీరు అడగండి. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ముష్టివేసినట్లు రూ.1000 మాత్రమే. అదే బాబును ప్రశ్నిస్తూ అడగండి. మా బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తూనే రూ.2250తో వచ్చాడు. ఇప్పటికే రూ.2750 చేశాడు. రూ.3వేలు కాబోతుంది అని అడగండి.
  అయ్యా బాబూ ఇంత మంచి చేస్తున్న మా బిడ్డతో కాకుండా నీతో సెల్ఫీ ఎలా దిగుతాము, నీకు సెల్ఫీ అడిగే అర్హత, నైతికత ఉందా అని నిలదీస్తూ అడగండి. వీళ్లంతా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అడగండి. ఇంటింటికీ అభివృద్ధి చేయడం అభివృద్ధా ? 
  లేక రామోజీ ఇంటికి, రాధాకృష్ణ ఇంటికి, టీవీ5 ఇంటికి, చంద్రబాబు ఇంటికి, దత్తపుత్రుడి ఇళ్లకు మూటలు పంపడం ఇదా అభివృద్ధా… అని గట్టిగా అడగండి.

  సామాజిక న్యాయం అంటే అన్ని కులాలలకు మంచి చేయటమా ? లేక బాబూ బృందం భోజనం చేయటమా ?అడగండి. 
  దేవుడి మీద భక్తి అంటే విజయవాడలో 45 గుళ్లను కూల్చివేయడమా ? మైనార్టీల మీద దేశద్రోహం కేసులు పెట్టడమా ? జన్మభూమి కమిటీలు మంచివా ? ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయావ్యవస్ధ, వాలంటీర్లు  వ్యవస్ధ మంచిదా అని అడగండి. 

  చంద్రబాబు గారికి సీఎం పదవి అంటే అరడజను దొంగలు గజదొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. మీ బిడ్డకు సీఎం పదవి ఇవ్వడం అంటే ఇంటింటా అభివృద్ధి. ఆరుకోట్ల ప్రజల ప్రతి ఇంటిలో అభివృద్ధి అని చెప్పండి.

  ఇవాళ మిమ్మల్ని కోరుతున్నాను. రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తాయి. గతాన్ని గుర్తుకు చేసుకొండి. గతంలో ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి చంద్రబాబు చూపించిన సినిమాను గుర్తుకు తెచ్చుకొండి. ఆరువందల పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాడు. ఎన్నికలు అయిపోగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశాడు. అక్కచెల్లెమ్మలకిచ్చిన మాటలు గాలికి ఎగిరిపోయాయి. 
  రైతన్నలకు చివరికి పిల్లలకిచ్చిన మాటలు సైతం గాలికి ఎగిరిపోయాయి. ఆ మేనిఫెస్టో ఎక్కడుందో వెదికినా వాళ్ల వెబ్‌సైట్‌లో కూడా కనిపించని పరిస్థితి. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో మేనిఫెస్టో అంటే భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా అధికారంలోకి వచ్చిన రోజునుంచి ఈ 46 నెలల కాలంలో ప్రతిరోజు, ప్రతిక్షణం మేనిఫెస్టో కోసం తపించాం. రాబోయే రోజుల్లో చాలా డ్రామాలు చూస్తాం. చాలా అబద్దాలు వింటాం.

  మీ బిడ్డ నమ్మకం మీరే.
  వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తో పాటు తోడుగా దత్తపుత్రుడు ఉన్నాడు. కానీ మీ బిడ్డకు ఇవేవీ లేవు. మీ బిడ్డ వీళ్లమాదిరిగా ఈ గజదొంగల ముఠాను నమ్ముకోలేదు. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడాన్ని నమ్ముకోలేదు.

  మీ బిడ్డ నమ్ముకున్నది ఆ దేవుడి దయను మిమ్మల్నే  అన్నది మాత్రం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకొండి. మీ బిడ్డకు తోడుగా ఉండేది మీరే. అబద్దాలు నమ్మకండి. మీ ప్రతి ఇంట్లో మంచి జరిగిందా ? లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకొండి. మీ ఇంట్లో మంచి జరిగితే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులు కావాలని ప్రతి సోదరుడికి, స్నేహితుడికీ, అక్కకూ చెల్లెకూ చెప్తున్నాను. 
  మీ జగన్‌ నమ్ముకున్నది మిమ్నల్నే. 
  దేవుడి దయ  ప్రజలందరి  చల్లనిదీవెనలు కూడా ఉండాలని, మంచి చేసే అవకాశం ఇవ్వాలని ఆశిస్తున్నాను.

  అక్టోబర్ నాటికి వెలిగొండ పూర్తి 
  ఈ జిల్లాకు సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించి..జిల్లాకు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు వెలిగొండ. మీ బిడ్డ హయాంలో మొదటి టన్నెల్‌ పూర్తయింది. రెండో టన్నెల్‌ కూడా ఈ సెప్టెంబరు, అక్టోబరులో పూర్తి చేసి అక్టోబరులో మళ్లీ వచ్చి వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తాను. మిగిలి ఉన్నది కేవలం 1.8 కిలోమీటర్లు మాత్రమే. మరో 5–6 నెలల్లో దాన్ని పూర్తి చేస్తాం. గతంలో నాన్నగారు 36 కిలోమీటర్ల సొరంగాలలో 20 కిలోమీటర్లు మేర దివంగత నేత స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డిగారు హయాంలో పూర్తి చేస్తే.. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు గారు ఏ మాత్రం పట్టించుకోకుండా కేవలం 5 కిలోమీటర్ల కూడా చేయలేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన 11 కిలోమీటర్లు పూర్తి చేసి ఆ ప్రాజెక్టును సెప్టెంబరులో ప్రారంభించబోతున్నాం. 

  మార్కాపురంకు వ‌రాల జ‌ల్లు
  ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే నాగార్జున కొన్ని విషయాలు అడిగాడు. ఎన్‌ఎస్‌పీ కెనాల్‌ నుంచి పొదిలి వరకూ రూ.50 కోట్లతో 17 కిలోమీటర్ల పనులకు పునాది వేశాం. మార్కాపురం మున్సిపాల్టీలో డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ కోసం పదివార్డులకు సంబంధించి దశాబ్ద కాలంగా పనులు జరగలేదు. ఆ పనుల చేసేందుకు దానికోసం రూ.5.20 కోట్లుతో శంకుస్ధాపన చేసాం.
  రూ.500 కోట్లతో మార్కాపురంలో మెడికల్‌ కాలేజీ పనులు జరుగుతున్నాయి. దానికి 13 ఎకరాలు భూమిలిచ్చిన రైతులున్నారు. వారికి కూడా మంచి చేస్తూ... రైతులకు మరో రూ.3లక్షలు ఇస్తున్నాం. పొదిలి డ్రైన్స్‌ కోసం రూ.11 కోట్లు మంజూరు చేస్తున్నాను. మార్కాపురంలో రూ.2 కోట్లతో షాదీఖానా, అంబేద్కర్‌ భవన్, బీసీ భవన్‌ మంజూరు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలతో మార్కాపురం నియోజకవర్గానికిమంచి జరగాలని ఆశిస్తున్నానని సీఎం తన ప్రసంగం ముగించారు.

Back to Top