ఫ్యాన్ గాలికి టీడీపీకి బీట‌లే

కాకినాడ స‌మ‌ర శంఖారావం స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ 

రేపు పొద్దున‌ అన్న ముఖ్యమంత్రి అవుతాడ‌ని చెప్పండి

వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా ప్రతి అక్క చేతుల్లో రూ. 75 వేలు

 మళ్లీ సున్నా వడ్డీకే  రుణాలు ఇచ్చే విప్లవాన్ని తీసుకొస్తా 

కాకినాడ‌:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్‌ గాలికి తెలుగుదేశం పార్టీకి బీటలు ప‌డాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్ర‌బాబు దుర్మార్గ‌పు పాల‌న‌పై ప్ర‌తి ఇంట్లో చ‌ర్చ జ‌ర‌గాల‌న్నారు. రేపు పొద్దున అన్న ముఖ్య‌మంత్రి అవుతాడ‌ని చెప్పాల‌ని సూచించారు. కాకినాడ సమ‌ర శంఖారావం స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..రేపు పొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తరువాత రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు బడికి పంపించినందుకు సంవత్సరానికి రూ. 15 వేలు అన్న ఇస్తాడని చెప్పాలి. ఓటు కోసం చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పాలి. ఈ రోజు మన పిల్లలు ఇంజినీరింగ్, డాక్టర్‌ చదువులు చదవలేరు. చదువుల కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నాం. రేపు పొద్దున్న అన్న ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు రూ. 3 వేలకు మోసపోవద్దు. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను ఇంజినీరింగ్‌ చదవాలన్నా, డాక్టర్‌లుగా చేయాలన్నా.. కలెక్టర్‌ వంటి చదువులకు ఎన్ని లక్షలు అయినా సరే అన్న చదివిస్తాడని ప్రతి గ్రామంలో చెప్పాలి. ప్రతి  అక్కకు చెప్పాలి. ప్రతి అన్నకు చెప్పాలి. ప్రతి చెల్లికి చెప్పాలి. ఆ ఇళ్లకు వెళ్లినప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు. అన్న ముఖ్యమంత్రి అయితే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సులో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. మీ కష్టాలు అన్నకు తెలుసు. మీ బాధలు అన్నకు తెలుసు. చంద్రబాబులా అన్న మోసం చేయడు. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. వైయస్‌ఆర్‌ చేయూత అనే కార్యక్రమం ద్వారా ప్రతి అక్క చేతుల్లో రూ. 75 వేలు నాలుగు దఫాల్లో అందిస్తాడని చెప్పండి. చంద్రబాబు ఇస్తున్న రూ. 3 వేలతో మోసపోవద్దు. అన్న ముఖ్యమంత్రి కావాలి. అన్న ముఖ్యమంత్రి అయితే పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఎన్నికల సమయానికి ఉన్న మొత్తం అప్పును నాలుగు దఫాలుగా మీ చేతికే ఇస్తాడని చెప్పండి. 

పసుపు – కుంకుమ పేరుతో చంద్రబాబు చేస్తున్నది మోసం అని చెప్పండి. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చేయని కారణంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి రుణాలు రూ. 14,200 కోట్లు ఉంటే అవి ఇవాళ వడ్డీలతో కలిపి రూ. 25 వేల కోట్లకు ఎగబాకిన సంగతి ప్రతి అక్కకు, చెల్లెమ్మకు చెప్పండి. 
ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా పసుపు – కుంకుమ పేరుతో చంద్రబాబు రూ. 6 వేల కోట్లు ఇస్తున్నట్లు ఫోజులు కొడుతున్నాడు. అక్టోబర్‌ 2016 నుంచి అక్కచెల్లమ్మలకు హక్కుగా రావాల్సిన సున్నా వడ్డీగా రావాల్సిన సొమ్ము ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎగరగొట్టిన సంగతి చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయితే రూ. 6 వేల కోట్లు కాదు.. రూ. 25 వేల కోట్ల రుణాలకు సంబంధించిన డబ్బు మొత్తం మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే డబ్బులు ఇచ్చే విప్లవాన్ని తీసుకొస్తాడు. బ్యాంకులు చిరునవ్వుతో అప్పులు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ప్రతి అక్కా చెల్లెమ్మ ముఖాల్లో చిరునవ్వు కనిపించాలంటే రాజన్న కొడుకు జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 

చంద్రబాబు నాయుడు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దన్నా.. చంద్రబాబుకు ఐదేళ్లు అవకాశం ఇచ్చాం. అడ్డగోలుగా మోసం చేశాడు. అది మరిచిపోవద్దన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి. రేపు పొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి రైతన్నకు సంవత్సరానికి రూ. 12,500లు ఇస్తాడని చెప్పండి. చంద్రబాబును నమ్మొద్దు. జూన్‌లో పంటలు వేసుకునే నాటికి కచ్చితంగా రైతు భరోసా కింద అన్న ఇస్తాడన్నా అని చెప్పండి. చివరకు ఒకటే చెబుతున్నా.. ప్రతి గ్రామంలో ప్రతి అవ్వాతాత దగ్గరకు వెళ్లండి. మూడు నెలల క్రితం వరకు చంద్రబాబు పెన్షన్‌ ఎంత ఇస్తుండేవాడని అడగండి. ఎన్నికలు వచ్చాయి కాబట్టి మూడు నెలల ముందు వరకు అవ్వాతాతలకు ఎంతిచ్చేవారో అడగండి. చాలా వరకు అందడం లేదని చెబుతారు. కొంతమంది వెయ్యి రూపాయలు అని చెబుతారు. గట్టిగా ఒక మాట చెప్పండి అవ్వాతాత మూడు నెలలుగా రూ. 2 వేల పెన్షన్‌ ఎవరిని చూసి ఇస్తున్నాడు. ఎవరికి భయపడి ఇస్తున్నాడని అడగండి. ఆ మాట చెబుతూ ప్రతి అవ్వాతాతకు చెప్పండి ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పెన్షన్‌ రూ. 3 వేలకు పెంచుకుంటూ పోతాడని గట్టిగా చెప్పండి. 
ఆరోగ్యశ్రీ పరిస్థితి చెప్పండి. ప్రతి పేదవాడు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పండి. ప్రతి పేదవాడికి ఇల్లు రావాలంటే అన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి వివరించండి. అన్న మేలు చేస్తాడు. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దని, నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశం తీసుకెళ్లండి. నవరత్నాలతో మనుషుల జీవితాల్లో వెలుగులు చూస్తామని నమ్ముతున్నా. ప్రతి ఇంటికి నవరత్నాలు తీసుకెళ్లి, ప్రతి ఒక్కరికీ అందేలా చేస్తా. చివరకు ఒక్కటి కచ్చితంగా చెప్పాలి. మీ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మీకు కేటాయించిన 35 ఇళ్లకు వెళ్తున్నప్పుడు ఒక అంశం గుర్తు పెట్టుకోవాలి. మన గుర్తు ఫ్యాన్‌ అని చెప్పడం మర్చిపోవద్దు. మన గుర్తు ప్రతి ఒక్కరికీ తెలియాలి. ఫ్యాన్‌ గాలికి తెలుగుదేశం పార్టీకి బీటలు కదలాలని పిలుపునిస్తున్నా. 

ఎలక్షన్‌ కమిషన్‌ వారు సీ–విజిల్‌ అనే యాప్‌ను ప్రవేశపెట్టారు. మీ అందరికీ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. సీ–విజిల్‌ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. తెలుగుదేశం పార్టీ వారు అన్యాయం చేస్తున్నట్లు కనిపిస్తే మీ ఫోన్లలో రికార్డు చేసి సీ–విజిల్‌లో ఎన్నికల కమిషన్‌కు పంపిస్తే 15 నిమిషాల్లోనే మీ దగ్గరకు ఒక టీమ్‌ వస్తుంది. వంద నిమిషాల్లోనే రిటర్నింగ్‌ అధికారి దానిపై నివేదిక ఇవ్వాలని చట్టం చెబుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు పార్టీ వారు ఎటువంటి అన్యాయం చేస్తున్నా సీ–విజిల్‌ యాప్‌ ద్వారా ఫోన్‌లలో బంధించి సెండ్‌ బటన్‌ నొక్కితే చాలు. ఇది కచ్చితంగా మర్చిపోకుండా చేయండి. చివరగా ఒక్క విషయం ప్రజలకు చెప్పండి. ఎన్నికలు రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలు కావూ.. ప్రజలకు, రాక్షసులకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పండి. నీతికి, అవినీతికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పండి. విశ్వసనీయతకు, అవకాశవాదానికి ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పండి. ప్రజాస్వామ్యానికి, అరాచకానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పండి. రాజకీయ వ్యవస్థలో విలువలు నిలబడాలన్నా.. విశ్వసనీయ అన్న పదానికి అర్థం రావాలన్నా.. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో క‌లిపేయాల‌ని పిలుపునిచ్చారు. నవరత్నాలతో ప్రతి పేదవాడి జీవితాన్ని మెరుగుపరిచే కార్యక్రమం జరగాలన్నా.. ఎన్నికలు సాఫీగా జరగాలన్నా జగన్‌ ఒక్కడితోనే జరిగేది కాదు.. జగన్‌కు మీ అందరి తోడు కావాలి. మీ అందరి సహాయం కావాలి. మీ అందరూ ఒక్కటే తోడుగా నిలబడితే వ్యవస్థలో మార్పు తీసుకువస్తా. చంద్రబాబు నాయుడిగా విలన్‌ పాత్ర కాదు పోషించేది. మంచివారు అధికార పీఠం ఎక్కితే హీరో పాత్ర కూడా పోషించగలరనే సంకేతం ఇవ్వగలుగుతాం. ఇది జరగాలంటే మీ అందరి తోడు, సాయం కావాలి. 
 

Back to Top