ఏనుగుల దాడిలో భ‌క్తుల మృతిపై వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి

పులివెందుల‌: అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగుల దాడిలో భక్తులు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులు ఏనుగుల దాడిలో మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వాన్ని కోరారు.

Back to Top