సమాజాన్ని  జాగృతం చేసిన గొప్ప క‌వి భ‌క్త క‌న‌క‌దాస‌

భక్త కనకదాస  జయంతి సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళులు

తాడేప‌ల్లి: తన కీర్తనల ద్వారా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సమాజాన్నిజాగృతం చేసిన గొప్ప క‌వి శ్రీ భ‌క్త‌ కనకదాస అని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు.  సమాజంలోని న్యూన్యతను తీవ్రంగా ఖండించార‌ని,  ఆయన ఆశయాలను రేపటి తరానికి పరిచయం చేయాలని పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకదాస జయంతి కార్యక్రమం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌న‌క‌దాస చిత్రపటానికి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, హిందూపురం వైయ‌స్ఆర్‌సీపీ ఇంఛార్జ్‌ టి.ఎన్‌.దీపిక, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Back to Top