ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి

నీతి అయోగ్‌ సమావేశంలో వైయస్‌ జగన్‌
 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి అయోగ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైయస్‌ జగన్‌  ప్లానింగ్‌ కమిషన్‌కు లేఖ అందజేశారు. విభజన సమయంలో పార్లమెంట్‌లో  ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, గతంలో బీజేపీ తన మేనిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పేర్కొంది. ప్రత్యేక హోదా ఏపీకి మంజూరు చేస్తూ గత కేబినేట్‌ తీసుకున్న నిర్ణయ కాపీలను ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యుడు అభిజిత్‌సేన్‌కు ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ అందజేశారు. ప్రత్యేక హోదాను రద్దు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీ నష్టపోయిందని తెలిపారు. రెవెన్యూ లోటును 22,113 కోట్లుగా అంచనా వేసిందన్నారు. గత ఐదేళ్లలో తెలంగాణకు లక్షా 18 వేల కోట్ల రెవెన్యూ మిగులు ఉందన్నారు. వాస్తవానికి గత ఐదేళ్లలో ఏపీ రెవెన్యూ లోటు రూ.66,362 కోట్లు ఉందన్నారు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. 2015–2016లో తెలంగాణలో తలసరి ఆదాయం రూ,14,414 కోట్లు రాగా ఏపీలో రూ.8,397 కోట్లు మాత్రమే అన్నారు. విభజన సమయంలో హోదా ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, హోదా లభిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు, మౌలిక వసతులు సమకూరుతాయని చెప్పారు. హైదరాబాద్‌ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన నగరమన్నారు. రాష్ట్ర విభజన నాటికి ఏపీకి రూ.97 వేల కోట్ల అప్పులు ఉన్నాయని, 2018–2019 నాటికి ఏపీ అప్పులు రూ.2 లక్షల 58 వేల కోట్లకు చేరాయని వివరించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top