బాబు ఓడించాలని రాష్ట్రమంతా ఏకం

మంగళగిరి సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

లోకేష్‌ను కూడా మంగళగిరిలో ఓడించాలి

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ రూ.10 వేలు ఇస్తున్నారట

చంద్రబాబు ఇచ్చే మూటలు మూటలు డబ్బులకు మోసపోవద్దు

రెండు రోజులు ఓపిక పట్టండి..జగనన్న వస్తాడని చెప్పండి.

ఉన్నత చదువుల కోసం ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని చెప్పండి

అధికారంలోకి రాగానే చేనేతలకు ఎమ్మెల్సీ ఇస్తాం

ఆళ్ల రామకృష్ణారెడ్డికి కేబినెట్‌లో స్థానం కల్పిస్తా

గుంటూరు: చంద్రబాబును ఓడించాలని రాష్ట్రమంతా ఏకమై నిర్ణయం తీసుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళగిరిలో లోకేష్‌ను కూడా ఓడించాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే అండగా ఉంటారని, ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి అపూర్వ విజయాన్ని అందించాలని కోరారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. 

ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలన చూశారు. మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక్కసారి మీ అందరినీ మీ గుండెల మీద చేతులు వేసుకొని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా.. ఐదు సంవత్సరాల పాలన చూశారు కాబట్టి రెండ్రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఆలోచన చేయండి. మీ పక్కనే ఆర్కే నిలబడి ఉన్నాడు. లోకల్‌ హీరో గురించి మీ అందరికీ తెలుసు. తన పొలంలో తానే నాట్లు వేస్తాడు. తానే కాడిపట్టుకొని దున్నుతాడు. గట్టుమీదనే భోజనం చేస్తాడు. తనతో పాటు పది మందికి రాజన్న క్యాంటిన్‌లో భోజనం కూడా పెటడతాడు. అందరికీ అందుబాటు ధరల్లో కూరగాయలు కూడా ఇస్తాడు. రైతులకు కష్టం వస్తే కోర్టుకు కూడా వెళ్తాడు. తనను కొనేందుకు చంద్రబాబు ప్రలోభాలు పెట్టినా.. ఏ మాత్రం తలొగ్గలేదు. నా సోదరుడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఐదేళ్లుగా మీ కోసం పనిచేస్తున్నాడు. 

టీడీపీ నుంచి ఇక్కడ అభ్యర్థిని ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి ఐదేళ్లుగా మంగళగిరి నేలమీద కాలు కూడా పెట్టలేదు. ఈ చుట్టు పక్కల రైతులకు ఎలాంటి రక్షణ కూడా ఉండదు. ఇప్పటికే మీరు చూస్తున్నారు. ఇష్టానుసారంగా భూములు ఆక్రమిస్తున్నారు. అడ్డుకోవాలంటే కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. తమ ఇష్టానుసారంగా భూములు లాక్కొని, అమ్ముకునేందుకు గద్దల్లా వచ్చి వాలుతున్నారు. బాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించుకున్నట్లే.. ఆయన కొడుకును కూడా ఓడించాలని మంగళగిరిలో ప్రతి ఒక్కరు నిర్ణయించుకోండి. ఇదే మంగళగిరిలోనే హాయ్‌ల్యాండ్‌ కుంభకోణం, సింగపూర్‌ కుంభకోణం, రిషితేశ్వరి చనిపోయింది కూడా ఇక్కడే. సదావర్తి భూముల కుంభకోణం, మూడు సెంటీమీటర్ల వర్షం పడితే.. లోపల ఆరు సెంటీమీటర్ల నీరు కనబడే శాశ్వత సచివాలయం, అసెంబ్లీ అవీ ఇక్కడే. అరటి తోటలను తగలబెట్టించింది ఇక్కడే.. చంద్రబాబు అక్రమ నివాసం ఇక్కడే.. మంగళగిరిలోనే నేతలను వంచించారు. మంగళగిరిలోనే నేతన్నల కోసం మేనిఫెస్టోలో పెట్టింది ఒక్కటి కూడా చేయనిది కూడా ఇక్కడే. మంగళగిరిలోనే స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కూలీలను, రైతులను బెదిరించింది.. మోసం చేసింది ఇక్కడే. దళితుల అసైన్డ్‌ భూములను లాక్కుంది ఇక్కడే. ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు కానీ, భూమిని తనకు కావాల్సిన కంపెనీలకు, కావాల్సిన ధరలకు ఇష్టం వచ్చినట్లుగా చంద్రబాబు లంచాలు తీసుకొని అమ్ముకుంది ఇక్కడే. కృష్ణానది పక్కనే ఉన్నా.. తాగునీరు కూడా సరిగ్గా అందించలేని పరిస్థితులు ఉంది ఇక్కడే. కూతవేటు దూరంలోనే సీఎం నివాసం.. ఆ పక్కనే ఇసుకను వందల కొద్ది లారీల్లో పెట్టి దోచుకుంటుంది ఇక్కడే.. 

సీఎం, ఆయన కొడుకు ఏనాడూ మంగళగిరిలో తిరిగింది లేదు. సమస్యలు ఏ రోజూ పట్టించుకుంది లేదు. ఆర్కేకి ఓటు వేస్తే మీ ఆస్తులు కాపాడుతాడు. ఆర్కేకి ఓటు వేస్తే మీ కుటుంబాలను అభివృద్ధి చేస్తాడు. ఆర్కేకి ఓటు వేస్తే నా కేబినెట్‌లో మంత్రిగా ఉంటాడని హామీ ఇస్తున్నా.. మరో విషయం కూడా చెబుతున్నా.. చంద్రబాబు పాట్నర్‌ పోటీ చేస్తున్న భీమవరం, గాజువాకలో బాబు, బాబు కొడుకు ప్రచారానికి వెళ్లరు. మరో పక్క చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం, ఆయన కొడుకు పోటీ చేస్తున్న మంగళగిరిలో ఆ పాట్నర్‌ ప్రచారానికి కూడా రాడు. వీరిద్దరివి వేరు వేరు పార్టీలా.. ఒకే పార్టీలా అని ఒక్కసారి ఆలోచన చేయండి. దుర్యోధనుడు ఏం చేసినా.. కౌరవ సభలో కొందరికి గొప్పగా కనిపిస్తుంది. అధికార మదంతో ఆ దుర్యోధనుడు చేసిన ప్రతి పనిని పొగిడిన వారిని దుష్టచతుష్టయం అంటుంటాం. అలాగే హిట్లర్‌ చేసిన దుర్మార్గాలు కప్పిపెట్టి.. రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోతున్నా కూడా నిజాన్ని దాచిపెట్టి హిట్లర్‌ గెలుస్తున్నాడని జర్మన్‌ రేడియోల్లో రోజూ తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారు గోబెల్స్‌. దుష్టచతుష్టయం చూసినా.. గోబెల్స్‌ పేర్లు వింటంటే.. మీకు మన రాష్ట్రంలో ఎవరైనా గుర్తుకు వస్తున్నారా.. ఇదే మాదిరిగా ఉండే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, టీవీ5 గుర్తుకు వస్తుందా.. ఎన్ని కుట్రలు చేసినా కూడా చివరకు చంద్రబాబు చేసిన మోసాలకు ఓటమి ఖాయమని, ప్రజలు నిర్ణయించుకున్న వేళ కూడా ప్రజలను నమ్మించడానికి బాకా ఊదుతున్న గోబెల్స్‌ కుట్రలను దయచేసి గమనించండి. 

పది ఎల్లో మీడియా చానళ్లు మైకులు పట్టుకొని దుష్ప్రచారం చేసినంత మాత్రాన చంద్రబాబు చేసిన మోసాలు, వంచనలు మంచిపనులు అయిపోతాయా.. ఐదు సంవత్సరాల పాలనలో రుణాలు మాఫీ చేస్తానని రైతులను దగా చేసింది ఎవరూ.. రుణాల మాఫీ అని పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను దగా చేసింది ఎవరూ ఒకసారి ఆలోచన చేయండి. చదువుకున్న పిల్లలను కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని, లేకపోతే ప్రతి ఇంటికి రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. అక్షరాల ప్రతి ఇంటికి 60 నెలల కాలంలో ప్రతి ఇంటికి రూ. 1.20 లక్షలు బాకీ పడింది ఎవరో గుర్తుచేసుకోండి. 

ప్రత్యేక హోదాను 2014లోనే అధికారంలోకి రాగానే అమలు కాకుండా వదిలేసింది ఎవరు. 2014 మార్చి2న రాష్ట్రాన్ని విడగొట్టిన తరువాత ప్లానింగ్‌ కమిషన్‌కు ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కమిషన్‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్లానింగ్‌ కమిషన్‌ 2014 డిసెంబర్‌ 31 వరకు అమలులోనే ఉంది. అయినా కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత జూన్‌ మాసంలో ముఖ్యమంత్రి అయి డిసెంబర్‌ వరకు కమిషన్‌ అమలులో ఉన్నా.. లేఖ రాయలేదు. కమిషన్‌ను ఒక్కసారి కలవలేదు.. రాష్ట్ర ప్రయోజనాలను, ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టింది ఎవరు. 2016 సెప్టెంబర్‌ 8న అర్థరాత్రి పూట హోదా వద్దూ.. ప్యాకేజీ కావాలని కేంద్రంతో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది ఎవరూ. లేని ప్యాకేజీ ఉన్నట్లుగా అసెంబ్లీలో రెండు సార్లు, మండలిలో రెండుసార్లు కేంద్రానికి ధన్యవాదాలు చెబుతూ తీర్మానాలు చేసింది ఎవరూ అని అడుగుతున్నా.. మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు. కేవలం ఏటా రూ. 3500 కోట్ల ఇస్తే చాలని లేఖ రాసింది ఎవరని ఆలోచన చేయండి. 2017 జనవరి 27న ప్యాకేజీ ఇచ్చిన నాలుగు నెలల తరువాత బీజేపీని పొగుడుతూ.. బీజేపీ మన రాష్ట్రానికి చేసినంతగా.. ఏ రాష్ట్రానికి చేయలేదని ప్రెస్‌మీట్‌ పెట్టి బీజేపీని పొగిడింది ఎవరూ.. కృష్ణపట్నం యాజమాన్యానికి లొంగిపోయి వారి లంచాలు తింటూ దుగ్గరాజుపట్నం ఓడరేవు వద్దూ అని లేఖ రాసింది ఎవరూ అని మీరంతా ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టింది చంద్రబాబు కాదా అని అడుగుతున్నా.. ఓటుకు కోట్ల కేసులో పట్టుబడి పది సంవత్సరాల హక్కు హైదరాబాద్‌పై మనకు ఉంటే హైదరాబాద్‌ను విడిచి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తప్పనిసరి పరిస్థితుల్లో రాజీపడ్డానని ఇటీవల ప్రకటించింది చంద్రబాబు కాదా అని అడుగుతున్నా.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టింది ఎవరూ.. కట్టకముందే రాజధాని భూములను స్విస్‌ చాలెంజ్‌ అంటే సింగపూర్‌ కంపెనీలతో రహస్య ఒప్పందం పెట్టుకొని 17 వందల ఎకరాల భూమిని రియలెస్టేట్‌ లేఅవుట్‌ వేసి ధారాదత్తం చేసింది ఎవరూ అని అడుగుతున్నా.. ఆత్మగౌరవం అంటూ మాట్లాడే పాట్నర్, ఎల్లమీడియా మన భూములను స్కాం చేసి వేరే దేశం వారికి అమ్మేస్తుంటే ఈ దుర్మార్గం మీద ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నా.. ల్యాండ్‌ పూలింగ్‌కు ఇవ్వనందుకు ఏకంగా పొలాలను తగలబెట్టించింది ఎవరూ అని ఆలోచన చేయండి. రాజధాని నిర్ణయానికి ముందే తన వారితో వేల ఎకరాల భూమిని కొనిపించి ఇక్కడి వారి దృష్టిని మళ్లించి తాను, తన బినామీలు భూములు కొనుక్కున్న తరువాత రాజధానిని ప్రకటించింది ఎవరూ అని ఆలోచన చేయండి. ఇది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాదా అని అడుగుతున్నా.. 

జగన్‌ కట్టుకున్న ఇల్లు ఎక్కడా అని అడిగితే.. తాడేపల్లిలో కనిపిస్తుందని ఎవరైనా చెబుతారు. కానీ చంద్రబాబు కట్టుకున్న ఇల్లు ఎక్కడా అని అడిగితే.. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అని చెబుతారు. రాష్ట్రంలో అద్దె ఇంటిలో ఉంటుంది ఎవరూ.. సొంత ఇంట్లో ఉంటుంది ఎవరూ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ ఐదు సంవత్సరాలు మోసాలు, అబద్ధాలు చూశారు. ఈ మోసాలకు క్లైమాక్స్‌ ఎన్నిక రోజు వచ్చే సరికి వస్తుంది. మీ అందరి ఓట్లు కొనుగోలు చేయడానికి, ప్రలోభాలు పెట్టేందుకు మంగళగిరిలో రూ. 10 వేలు ఓటుకు ఇస్తున్నారని వినిపిస్తుంది. చంద్రబాబు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినా.. మీరంతా ప్రతి వార్డు, ప్రతి గ్రామంలోకి వెళ్లి ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి అవ్వాతాతకు చెప్పండి. 

అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 10 వేలకు మోసపోవద్దు.. ఒక్కసారి అన్నకు అవకాశం ఇద్దాం.. రెండు రోజులు ఓపికపడుదాం.. ఆ తరువాత మన పిల్లలను మనం బడికి పంపిస్తే చాలు అన్న రూ. 15 వేలు ప్రతి సంవత్సరం ఇస్తాడని చెప్పండి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. మన పిల్లలను నాలుగు రోజులు ఓపిక పట్టు అక్కా.. మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్‌ చదవాలన్నా.. సంవత్సరానికి ఫీజులు చూస్తే లక్ష రూపాయలకు పైనే పలుకుతున్నాయి. మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ చదివించాలంటే ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివించలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రతి అక్కకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 10 వేలకు మోసపోవద్దు అక్కా.. రెండు రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు అన్న చదివిస్తాడని చెప్పండి. 

పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 10 వేలకు మోసపోవద్దని చెప్పండి. ఐదు సంవత్సరాలు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని ప్రతి అక్కను అడగండి. రుణాలు మాఫీ కాకపోగా గతంలో సున్నావడ్డీకే వచ్చే రుణాలు పూర్తిగా ఎగరగొట్టాడని చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 10 వేలకు మోసపోవద్దు అక్కా.. చంద్రబాబు చేసే పసుపు – కుంకుమ డ్రామాకు అసలు మోసపోవద్దు అక్కా.. రెండు రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. పొదుపు సంఘాల రుణాలన్నీ అన్న నాలుగు దఫాలుగా చేతికే ఇస్తాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 

పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే డబ్బుకు మోసపోవద్దు అక్కా.. రెండు రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 

గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 10 వేలతో మోసపోవద్దు అన్నా.. రెండు రోజులు ఓపికపట్టు అన్న.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబడుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు..  గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 

అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. పెన్షన్‌ వచ్చేది కాదని, లేకపోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. రెండు రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 

ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఇల్లు లేదు. చంద్రబాబు ఊరికి కనీసం 10 ఇళ్లులు కూడా కట్టించలేదు. రెండు రోజులు ఓపిక పట్టు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అక్షరాల 25 లక్షల ఇళ్లులు కట్టిస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యంలో ఇళ్లు కట్టడం చూశాం. మళ్లీ అది ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యమని ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి.

మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలు ఎక్కువ. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో చేనేతలకు 2014 ఎన్నికల సమయంలో చేనేతల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు.. వడ్డీ లేకుండా రుణాలు ఇస్తానన్నాడు.. ప్రతి చేనేత కుటుంబానికి ఇల్లు, షెడ్‌ కట్టిస్తానన్నాడు. ప్రతి చేనేత కుటుంబానికి సబ్సిడీ కింద రూ. వెయ్యి ఇస్తానన్నాడు. వీటిలో కనీసం ఒక్కటైనా పూర్తిగా అమలు చేశాడా.. చంద్రబాబు. ఈ మోసపూరిత పాలనకు చరమగీతం పాడండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి చేనేతల బతుకులు మారుస్తా. ప్రతి చేనేత కుటుంబానికి నవరత్నాల్లో చెప్పిన ప్రతి అంశం మీ గడపకు తీసుకురావడమే కాకుండా.. ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ. 24 వేలు ఇస్తాం. నేరుగా గ్రామ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్‌ వస్తుంది.. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను పెడతాం. ఆ వాలంటీర్‌ వచ్చి మీ తలుపులు కొట్టి ప్రతి పథకం డోర్‌ డెలవరీ చేసిపోతాడని మాటిస్తున్నా.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అప్పట్లో 2004లో నాన్నగారికి అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాల మూడు నెలల పాలన తరువాత ఇవాల్టికి వైయస్‌ఆర్‌ ఎక్కడున్నారంటే మా గుండెల్లో బతికే ఉన్నాడనే పాలన ఇచ్చాడు. ఒక్కసారి మీ బిడ్డకు అవకాశం ఇవ్వండి నాన్నగారి కంటే గొప్ప పాలన అందిస్తా..

 చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానా చేస్తానని చెబితే.. మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తరువాత ఇచ్చిన హామీ అమలు చేయకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది.  రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకురావాలిన కోరుతున్నాను.మీ చల్లని దీవెనలు ఎమ్మెల్యే అభ్యర్థి, నా సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఉంచాలని కోరుతున్నాను. చేనేతలకు ఇంకో హామీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గుంటూరు జిల్లా నుంచి ఇవ్వబోయే మొట్టమొదటి ఎమ్మెల్సీ చేనేతలకు ఇస్తానని హామీ ఇస్తున్నా.. ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న వేణుగోపాల్‌రెడ్డిపై మీ ఆశీస్సులు ఉంచాలని కోరుతున్నా.. చివరగా మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. 

 

Back to Top