మచిలీపట్నం: పేదలకు సొంతింటి కలను నిజం చేస్తానని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి..ఇళ్లు కట్టిస్తామన్నారు. చంద్రబాబు రూ.3 లక్షలు చేయని ప్లాటును రూ.6 లక్షలకు పేదలకు అమ్ముకుంటున్నారు..ఆ ప్లాట్ తీసుకున్న పేదల పేరు మీద రూ.3 లక్షలు అప్పు రాస్తున్నారని, ఆ అప్పును మాఫీ చేస్తానని మాటిచ్చారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో వైయస్ జగన్ ప్రసంగించారు. నా 3648 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. ఆ దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో పాదయాత్ర పూర్తి చేశాను. పాదయాత్ర ఇదే నియోజకవర్గం గుండా కూడా సాగింది. ఆ రోజు మీరంతా నా దగ్గరకు వచ్చి చెప్పిన ప్రతి సమస్య నాకు గుర్తుంది. ఇక్కడే పోర్టు వస్తుందని, పోర్టు వస్తే ఉద్యోగాలు చెందుతాయి. మచిలీపట్నం అభివద్ధి చెందుతుందని గత 12 సంవత్సరాలుగా ఇది ఒక కలగానే మిగిలిన స్వప్నంగా మీరు చెప్పిన మాట గుర్తుంది. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్నపుడు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత నాన్నగారు మరణించిన తరువాత పోర్టు కావాలని, రావాలని పట్టించుకున్న వారు ఒక్కరు కూడా లేరు. చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ 2014లో అన్న మాటలు బాగా గుర్తున్నాయి. పోర్టు కోసం 4800 ఎకరాల భూసేకరణ కోసం నాన్నగారు ప్రయత్నిస్తే.. అప్పట్లో చంద్రబాబు అన్న మాటలు పోర్టుకు 4800 ఎకరాలు ఎందుకు 1800 ఎకరాల్లో కట్టేయోచ్చు కదా అన్నాడు. తాను అధికారంలోకి రాగానే ప్రతి ఊరికి వెళ్లి 18వందల ఎకరాల్లోనే పోర్టు కట్టిస్తానని మైక్ పట్టుకొని చెప్పాడు. ఎన్నికలు అయిపోయాయి.. ప్రజలతో పని అయిపోయింది.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత 33 వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చాడు. 2015లో 33 వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇస్తూ రాత్రికి రాత్రి జీఓ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని సవరిస్తున్న ఇచ్చిన ఆర్డినెన్స్ గడువు ఒక్క రోజులో ముగుస్తుందనగా రాత్రికి రాత్రి జీఓ విడుదల చేశాడు. రైతులు తమ బిడ్డకు పెళ్లికి కట్నంగా కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. రైతులను బిడ్డలను పెళ్లీలు చేసుకోవడానికి కూడా ఎవరూ ముందుకురాని పరిస్థితి. వ్యవసాయానికి బ్యాంకుల నుంచి లోన్‌లు కూడా రావడం లేదు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో నేను మూడు సార్లు వచ్చి నేను ఉన్నానని ఆరోజు భరోసా ఇచ్చా. ప్రతి రైతుకు చెబుతున్నా.. 33 వేల ఎకరాలు అవసరం లేదు. అదే 4800 ఎకరాల కన్నా.. ఒక్క ఎకరా కూడా ఎక్కువ తీసుకోం.. ఆ తరువాత వాళ్ల భూముల్లో రైతులు ఏం చేసుకుంటారో వారి ఇష్టం. ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకోవడం అన్యాయమైన విషయం. మన ప్రభుత్వం వచ్చిన తరువాత న్యాయం జరుగుతుంది. ప్రకాశం బ్యారేజీ నుంచి వస్తున్న నీరు బందరు వరకు రావడం లేదని, ఐదేళ్లుగా రెండు పంటలకు కనీసం ఒక్క పంట కూడా సరిగ్గా పండడం లేదని రైతులు చెప్పిన మాట గుర్తుంది. నాన్నగారి హయాంలో కష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పనులు మొదలు పెట్టి నాన్నగారు చనిపోయిన తరువాత ఆ కష్ణా డెల్టా ఆధునీకరణకు గాలికి వదిలేశారు. రైతులకు నీరు అందడం లేదు.. కాస్త పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా రావడం లేదు. వరికి కనీస మద్దతు ధర రూ. 1750 ఉంటే కానీ రైతుకు పంట చేతికి వచ్చే సరికి రూ. 12 వందలు కూడా రావడం లేదు. ఇంతటి దారుణంగా చంద్రబాబు పాలన సాగుతుంది. మినుములు చూస్తే కనీస మద్దతు ధర రూ. 5600, రైతుకు పంట చేతికి వచ్చే సరికి రూ. 4600 కూడా రావడం లేదు. మచిలీపట్నంలో ప్రజలకు కనీసం చేసిందేమీ లేదు కానీ, భూకబ్జాలు, అన్యాయాల గురించి ప్రజలు చెప్పారు. శ్మశానవాటికలు, బహిరంగ మురుగుదొడ్లు కూడా వదిలిపెట్టకుండా భూకబ్జాలు చేస్తున్నారని చెప్పిన విషయాలు నాకు ఇంకా గుర్తున్నాయి. బెల్ సంస్థ కోసం 25 ఎకరాల్లో అవినీతి ఫ్లాట్లు కట్టడం చూస్తున్నాం. ఎవరైనా కూడా పేదవాడి జీవితంతో చెలగాటం ఆడే వ్యక్తులను అవినీతి రాక్షసులు అనాలి. పేదవాడికి ప్లాట్లు కట్టిస్తున్నాడంట. ఆ ఫ్లాట్లు కట్టడానికి ఎంత అయితుందని ఏ బిల్డర్‌ను అడిగినా కూడా గవర్నమెంట్ స్థలం ఉచితంగా ఇస్తుంది. సిమెంట్ సబ్సిడీ, లిఫ్టు, గ్రనైట్ ఫ్లోరింగ్ కూడా లేనప్పుడు ఏ బిల్డర్ అయినా అడుగుకు రూ. వెయ్యి మించదని చెబుతారు.. 300 అడుగుల ఫ్లాటు అడుగుకు రూ. 2 వేలకు అమ్ముతున్నాడు. కేంద్రం, రాష్ట్రం ఇస్తున్న రూ. 3 లక్షలు కాకుండా.. మిగిలిన రూ. 3 లక్షలు అప్పుగా పేదవాడి పేరు మీద రాసుకుంటారంట. ఆ అప్పు పేదవాడు తీర్చడం కోసం 20 సంవత్సరాలు పాటు నెలకు రూ. 3 వేలు కడుతూ.. పోవాలంట. లంచాలు తీసుకునేది చంద్రబాబు ఆ లంచాలకు పేదవాడు నెలకు రూ. 3 వేలు కట్టాలంట. ప్రతి పేదవాడికి హామీ ఇస్తున్నా.. ఎన్నికలు కాబట్టి చంద్రబాబు ఫ్లాట్లు ఇస్తే తీసుకోండి.. దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన తరువాత జగన్ అనే నేను.. ఆ పేదవాడిపై ఉన్న అప్పు మాఫీ చేస్తానని హామీ ఇస్తున్నా. నాన్నగారి హయాంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చారు. ఇదే మచిలీపట్నంలో పేదవారికి రూ. 4 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చిన పరిస్థితి గుర్తు చేసుకోండి. ప్రస్తుతం ఇళ్ల స్థలాల కోసం పది వేలకు పైచిలుకు దరఖాస్తు చేసుకున్నారు. ఐదు సంవత్సరాలు కనీసం పట్టించుకున్న నాధుడు కరువయ్యాడు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ అనే నేను హామీ ఇస్తున్నా.. మొత్తం అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం.. ఇళ్లు కూడా కట్టిస్తాం. ఇదే మచిలీపట్నంలో దాదాపుగా వేల మంది రోల్డ్ గోల్డ్ నగల తయారీపై ఆధారపడి బతుకుతున్నారు. దీని ప్రాధాన్యతను గుర్తించి పోతేపల్లిలో 42 ఎకరాల్లో ఇమిటేషన్ జ్యువెల్లరీ పార్కు కూడా ఏర్పాటు చేశారు. ఆ పార్కుకు అవసరం అయిన నీటిని కూడా ఇవ్వలేని అధ్వాన్నమైన చంద్రబాబు పాలన సాగుతోంది. గతంలో నాన్నగారి హయాంలో కరెంటు చార్జీలు రూ. 3.75 పైసలు ఉంటే.. ఇప్పుడు రూ. 7 నుంచి రూ. 9 వసూలు చేస్తున్నారు. దాదాపుగా 50 వేల మంది పైచిలుకు ప్రజలకు కనీసం కరెంటే రేట్లు తగ్గించాల్సిందిపోయి ఏకంగా రూ. 9 పెంచితే పేదవాడు ఏరకంగా బతుకుతాడు. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నీరు ఇవ్వడమే కాకుండా.. కరెంటు రేటు రూ. 3.75 పైసలకే ఇస్తాం. మత్స్యకారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట హాలిడే డిక్లేర్డ్ చేసినప్పుడు రూ. 4 వేలు ప్రతి కుటుంబానికి ఇస్తామన్నారు. తూతూమంత్రంగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని పూర్తిగా మారుస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి మత్స్యకారుడికి వేట విరామం సమయంలో రూ. 10 వేలు ఇస్తాం. ప్రతి ఇంటికి వచ్చి తలుపుతట్టి గ్రామ వాలంటీర్ డోర్ డెలవరీ చేసిపోతాడని చెబుతున్నా.. చంద్రబాబు పాలనపై ఒక్కసారి ఆలోచన చేయండి. మనం చూస్తుందేమిటని ఆలోచన చేయండి. ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు పాలనలో ప్రతి అడుగులో మోసం.. మోసం అని కనిపిస్తాయి. ఒకసారి గమనించండి. ఆడవాళ్లను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు పసుపు – కుంకుమ అని బిల్డ్ ఇస్తున్నాడు. పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలు ఆలోచన చేయండి. ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా ఆలోచించండి.. పొదుపు సంఘాలకు సంబంధించిన అక్కచెల్లెమ్మలకు సున్నావడ్డీ వచ్చిందా అని అడుగుతున్నా.. సున్నావడ్డీ అనే పథకాన్ని చంద్రబాబు మే 2016 నుంచి రద్దు చేశాడు. పొదుపు సంఘాల్లోని అక్కచెల్లెమ్మల బందాలు మామూలుగా రూ. 5 లక్షలు, కొన్ని సంఘాలు రూ. 7 లక్షలు తీసుకుంటాయి. రూ. 5 లక్షలు తీసుకునే సంఘాలు సంవత్సరానికి రూ. 60 వేలు వడ్డీ కడతారు. రూ. 7 లక్షలు తీసుకునే బందం రూ. 84 వేలు, రూ. 10 లక్షలు తీసుకున్న బందం రూపాయి వడ్డీ కింద రూ. 1.20 లక్షల వడ్డీలు కడతారు. మే 2016 నుంచి సున్నా వడ్డీ పథకం చంద్రబాబు రద్దు చేశాడు కాబట్టి మూడు సంవత్సరాల్లో రూ. 5 లక్షలు తీసుకున్న బందాలు సంవత్సరానికి రూ. 60 వేలు రూపాయి వడ్డీ కింద కడితే మూడు సంవత్సరాలకు రూ. 1.20 లక్షల వడ్డీ కట్టారు. రూ. 7 లక్షలు తీసుకున్న బందాలు రూ. 2.52 లక్షలు, రూ. 10 ల క్షలు తీసుకున్న బందాలు రూ. 3.60 లక్షలు వడ్డీల రూపంలో కట్టారు. సున్నావడ్డీ రద్దు చేయడంతో అక్కచెల్లెమ్మలు లక్షల రూపాయల వడ్డీ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్నికల ముందు పసుపు – కుంకుమ అని పేరు పెట్టి రూ. లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ. 87,612 కోట్ల రుణాలు ఉన్నాయి. ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు పుణ్యమా అని రైతులకు సున్నావడ్డీ కింద కట్టాల్సిన పథకం పూర్తిగా రద్దు చేశాడు. ఐదు సంవత్సరాల్లో రైతులు వడ్డీలు కట్టుకుంటూ అసలు రూ. 87,612 కోట్ల వడ్డీతో కలిపి రూ. 1.50 లక్షల కోట్లకు రెట్టింపు అయిందంటే ఏ స్థాయిలోమోసం చేశారో అర్థం చేసుకోండి. రుణమాఫీ అని పేరు పెడుతూ.. అక్షరాల రూ. 24 వేల కోట్లు ఇస్తానని సంతకం పెట్టాడు. ఇచ్చింది రూ. 14 వేల కోట్లు. రూ. 87,612 వేల కోట్లకు కనీసం పదిశాతం వడ్డీ వేసుకున్నా.. ఐదు సంవత్సరాలకు కలిపి రైతులు రూ. 40 వేల కోట్ల వడ్డీలు కడితే చంద్రబాబు మాత్రం ముషివేసినట్లుగా ఇచ్చింది కేవలం రూ. 14 వేల కోట్లు. ఇలాంటి దుర్మార్గమైన పాలన గురించి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి కావడం కోసం చంద్రబాబు 2014లో జాబు కావాలంటే బాబు రావాలి అన్నాడు. ప్రతి ఇంటికో ఉద్యోగం, ఉపాధి అన్నాడు. ఈ రెండు ఇవ్వకపోతే నెలకు రూ. 2 వేల భతి ఇస్తానన్నాడు. ఐదు సంవత్సరాలకు కలిపి రాష్ట్రంలో కోటి 70 లక్షల ఇళ్లు ఉంటే ఆ ప్రతి ఇంటికి ఐదు సంవత్సరాల్లో రూ. 1.20 లక్షల బాకీ ఉన్నాడు. ఎన్నికలకు మూడు నెలల ముందు మూడు లక్షల ఇళ్లకు తీసుకువచ్చి రూ. 2 వేల భతిని తగ్గించి రూ. వెయ్యి ముష్టివేసినట్లుగా మూడు లక్షలమందికి ఇచ్చాడు. ఒకసారి ఈ మోసాల గురించి ఆలోచన చేయండి. ఎలాంటి ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేయండి. 70 ఏళ్ల ముసలి వ్యక్తి చంద్రబాబు బాగా మేకప్ వేసి 25 ఏళ్ల పిల్లవాడిలా బిల్డప్ ఇచ్చి 2014లో 50 పేజీల ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాడు. వ్యవసాయ రుణాలు మాఫీ, రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పొదుపు సంఘాల రుణాల మాఫీ, బెల్టుషాపులు రద్దు, మహిళలకు భద్రత, ప్రత్యేక పోలీసు వ్యవస్థ, ఆపదలో ఉన్న మహిళల సెల్‌ఫోన్ ద్వారా ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో సాయం, యువతకు ఉద్యోగం, ఉపాధి, గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, పేదలకు కేజీ నుంచి పీజీ వరకు విద్య, ఎన్టీఆర్ సజల స్రవంతి పథకం ఇంటింటికీ రూ. 2కే 20 లీటర్ల మినరల్ వాటర్, అవినీతి లేని సుపరిపాలన.. మళ్లీ ఇవాళ 2019 మేనిఫెస్టో 34 పేజీలతో వచ్చాడు. మొదటి పేజీలో.. 2014 మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ప్రణాళిక బద్ధంగా పూర్తిగా అమలు చేశామని సిగ్గులేకుండా అబద్ధాలు ఆడుతున్నాడు. ఒక పెద్దమనిషి ఈ మాదిరిగా మోసం, అబద్ధాలు ఆడుతుంటే ఒక్కసారి ఆలోచన చేయండి. వ్యవస్థలోకి మార్పు రావాలా.. వద్దా.. ఏదైనా రాజకీయ నాయకుడు మైక్ పట్టుకొని పలానిది చేస్తానని చెబితే.. ఆ నాయకుడు మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు అడిగి గెలిచిన తరువాత హామీ అమలు చేయకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఓటు వేయండి అని కోరుతున్నా.. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లండి. నవరత్నాలతో జీవితాలు ఏ విశంగా బాగుపడతాయో ఒక్కసారి ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి అవ్వా, తాతకు చెప్పాలని రెండు చేతులు జోడించి పేరు పేరునా కోరుతున్నా.. నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి ఇంటికి డోర్ డెలవరీ చేయిస్తానని మాటిస్తున్నా.. మీ చల్లటి దీవెనలు పేర్ని నాని మన పార్టీ తరుపున ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు.. అన్ని రకాలుగా మంచి చేస్తాడు.. ఆశీర్వదించండి. ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న బాలశౌరిని గెలిపించాలని పేరుపేరునా కోరుతున్నా.. మన పార్టీ గుర్తు ఫ్యాన్ అని ఎవరూ మర్చిపోవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా..