విశ్వసనీయతకు ఓటేయండి

నందిగామ సభలో వైయస్‌ జగన్‌ పిలుపు

చంద్రబాబుకు ఓటేస్తే ఈసారి గవర్నమెంట్‌ స్కూళ్లే ఉండవు

బాబుకు ఓటేస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్, పక్కా ఇళ్లు ఉండవు

బాబుకు ఓటేస్తే లారీ ఇసుక లక్ష రూపాయలు దాటిపోతోంది

బాబుకు ఓటేస్తే కరెంటు, ఆర్టీసీ ప్రయివేట్‌ పరం అవుతాయి

ఐదేళ్ల పాలనలో కరెంటు, ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు

చంద్రబాబు సీఎం అయ్యాక పింఛన్లను గణనీయంగా తగ్గించేశారు

దేళ్ల బాబు పాలనలో మోసాలు, దుర్మార్గాలను చూశాం

చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు

కృష్ణా జిల్లా: ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మోసాలు, అబద్ధాలు, కుట్రలు చూశామని, ఈ సారి విశ్వసనీయతకు ఓటేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో కరెంటు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్నులు, స్కూల్‌ ఫీజుల బాదుడే బాదుడు అన్నారు. ఈ వ్యవస్థలో మార్పు రావాలని, ప్రతి ఒక్కరిని కలిసి ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపిక పడితే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని, నవరత్నాలతో మేలు చేస్తారని చెప్పాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కృష్ణా జిల్లా..నందిగామ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.

 •  వర్షాభావ ప్రాంతం, ఈ నియోజకవర్గంలో దాదాపు 30 వేల ఎకరాలు సుబాబులు పంట పండిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు పాలన మీరంతా చూస్తున్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన ఒకసారి గుర్తుకు తెచ్చుకోమని కోరుతున్నా.. ఆ రోజుల్లో ఇదే సుబాబులు పంటకు రూ. 4,400 టన్నుకు వచ్చేదా.. కాదా... చంద్రబాబు పాలనలో ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా.. కనీసం రూ. 2500 అయినా వస్తుందా అని అడుగుతున్నా.. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో రైతన్నలకు గిట్టుబాటు ధరలు లేవు, చేస్తాను అన్న రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని విధంగా జరుగుతుంది ఆ పథకం. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. నందిగామ నియోజకవర్గంలో అగ్రిగోల్డ్‌ బాధితులు ఎక్కువే.. ఈ ఐదు సంవత్సరాలుగా కనీసం ఒక్క రూపాయి అయినా మేలు జరిగిందా అని అడుగుతున్నా.. అగ్నిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరగకపోగా.. చంద్రబాబు, ఆయన కొడుకు, ఆయన బినామీలు, ఆయన మంత్రులు యథేచ్ఛగా దోచేస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో అన్నా సాగరంతో పాటు అనేక ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఈ పథకాలు మరమ్మతులకు గురై నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఒక్కసారి చంద్రబాబు పాలనలో మనకు ఏమైనా మంచి జరిగిందా అని గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయండి. 
 • ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏమిటీ.. తరువాత ఆయన చేసిన పనులు ఏమిటని ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు పాలనలో మనం చూసింది అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అవినీతి, దుర్మార్గాలు చూశాం. ఇలాంటి పాలన చూసిన తరువాత పొరపాటున కూడా మళ్లీ చంద్రబాబుకు ఓటు వేస్తే ఈ సారి ఇక గవర్నమెంట్‌ స్కూళ్లే ఉండవని మర్చిపోవద్దు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు ఆరు వేలు మూతపడ్డాయి. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పేదవారు ఎవరూ తమ పిల్లలను బడికి పంపించే పరిస్థితి ఉండదు. రాష్ట్రమంతా ప్రభుత్వ పాఠశాలలు కనిపించవు.. మీకు కనిపించేవి నారాయణ స్కూళ్లు, కాలేజీలు కనిపిస్తాయి. ఇప్పటికే ఎల్‌కేజీ చదివించాలంటే నారాయణ స్కూల్‌లో రూ. 25 వేలు.. ఈ సారి బాబుకు ఓటేస్తే సంవత్సరానికి ఫీజు రూ. లక్ష దాటుతుంది. 
 • కాలేజీల్లో చదివించే పరిస్థితి లేదు. ఆస్తులు అమ్ముకుంటే ఇంజనీరింగ్‌ చదివించలేని పరిస్థితి ఉంది. ఈ సారి చంద్రబాబుకు పొరబాటున ఓటు వేస్తే ఈసారి రూ. 5 లక్షలు దాటుతుందని మర్చిపోవద్దు. పొరపాటున మళ్లీ చంద్రబాబుకు ఓటు వేస్తే కరెంటు, ఆర్టీసీ చార్జీలు ఏవీ గవర్నమెంట్‌లో ఉండవని, అన్ని ప్రైవేట్‌ వ్యవస్థలకు అప్పగిస్తాడని మర్చిపోవద్దు. ఇప్పటికే కరెంటు చార్జీలు బాదుడే.. బాదుడు. ఆర్టీసీ చార్జీలు బాదుడే.. బాదుడు. ఐదు సంవత్సరాల్లో ఇంటి పన్నులు బాదుడే.. బాదుడు. చివరకు నీటి కుళాయి పన్ను బాదుడే.. బాదుడు. పెట్రోల్, డీజిల్‌ రేట్లు బాదుడే.. బాదుడు. ఇప్పటికే చంద్రబాబు పాలనలో ఇవన్నీ బాదుడే.. బాదుడు. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక మీదట వీర బాదుడు ఉంటుందని మర్చిపోవద్దు. పొరపాటున ఓటు వేస్తే అధికారంలోకి రాగానే పెన్షన్లు తీసేస్తాడు, రేషన్‌ కార్డులు కూడా కోసేస్తాడని మీ అందరికీ చెబుతున్నాను. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు మన రాష్ట్రంలో పెన్షన్‌ కార్డులు అక్షరాల 44 లక్షలు ఉండేవి. ఈయన ముఖ్యమంత్రి అయిన తరువాత 36 లక్షలకు తగ్గించేశాడు. రేషన్‌ కార్డుల పరిస్థితి మీ అందరికీ తెలిసిందే.. మళ్లీ ఎన్నికలు వచ్చాయని మూడు నెలల కోసం రేషన్‌కార్డులు, పెన్షన్‌ కార్డులు పెంచాడు. ఇవేవీ మర్చిపోవద్దు. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మీ భూములు, ఇళ్లు ఎక్కడ పడితే అక్కడ లాక్కునే ప్రయత్నం చేస్తాడు. 
 • ఒక్కసారి ఓటు వేసినందుకు భూసేకరణ చట్టాన్ని సవరణ చేశాడు. వెబ్‌ ల్యాండ్‌ పేరిట మీ భూముల రికార్డులు తారుమారు చేసేందుకు, మాయం చేసేందుకు ఎన్ని పన్నాగాలు పన్నుతున్నాడో చూస్తున్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మీ భూములు ఉండవు. మీ ఇళ్లులు ఉండవని మర్చిపోవద్దు. ఇప్పటికే మీ గ్రామాల్లో చూస్తున్నారు. ఇసుకను వదలడం లేదు. మట్టిని, కొండలు, గుట్టలు, పొలాలు, నదులు కూడా వదిలిపెట్టడం లేదు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక అంతో ఇంతో మిగిలి ఉన్న ఇసుక, మట్టి, గుట్టలు, కొండలు, నదులు ఏవీ మిగలవు. ఇప్పటికి ఇసుక లారీ రూ. 40 వేలు పలుకుతుంది. పొరపాటున ఓటేస్తే లక్ష రూపాయలకు పాకుతుందని మర్చిపోవద్దు. ఇప్పటికే గ్రామాల్లో జన్మభూమి కమిటీలు పెట్టి పెన్షన్, గవర్నమెంట్‌కు సంబంధించిన ఏ సంక్షేమ పథకం అయినా మీ చేతికి రావాలంటే వారు అడుగుతున్న ప్రశ్న ఏమిటీ..? మీరు ఏ పార్టీ వారని జన్మభూమి కమిటీ అడుగుతుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఈసారి మీరు ఏ సినిమా చూడాలో.. మీ ఏ టీవీ చానళ్లు, ఏ పత్రికలు చదవాల్లో ఇదే జన్మభూమి కమిటీలు నిర్ణయిస్తాన్న సంగతి మర్చిపోవద్దు. వారు ఏది చెబితే అది చేయాలి.. డబ్బులు ఎంత చెబితే అంత చెల్లించాల్సిన పరిస్థితి దాపురిస్తుందని మర్చిపోవద్దు. 
 • పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఇక ఉచిత విద్యుత్‌ ఉండదని మర్చిపోవద్దు. ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆరోగ్యశ్రీ, 108, 104 ఇక ఏవీ కనపడవని గుర్తుపెట్టుకోండి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న ఫీజురియంబర్స్‌మెంట్‌ ఉండదు. పక్కా ఇళ్ల పథకాలు ఉండవని, అన్నీ కూడా రద్దు అయిపోతాయని మర్చిపోవద్దు. ఒక్కసారి ఇదే పెద్దమనిషి చంద్రబాబు గత చరిత్రను గుర్తు చేసుకోండి. 1994 ఎన్నికలను గుర్తు చేసుకోండి. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటలు, వాగ్ధానాలు సంపూర్ణ మద్య నిషేదం, రూ. 2కే కిలోబియ్యం అని ఎన్నికల్లో గెలిచింది. ఎన్నికలు అయిపోయిన తరువాత 1995లో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కాడు.. రూ. 2కే కిలోబియ్యం మొదట మూడున్నర రూపాయలకు పోయింది. ఆ తరువాత ఐదు రూపాయల 20 పైసలకు పోయింది. మద్యపాన నిషేదం పూర్తిగా ఎత్తేశారని మర్చిపోవద్దు. 
 • పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఆ తరువాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు వడ్డీలు పూర్తిగా పెంచేస్తాడు. ఇప్పటికే సున్నావడ్డీ పూర్తిగా ఎగరేశాడు. చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే రైతులకు బ్యాంకుల నుంచి వచ్చే రుణాలకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పేరు చెప్పి రుణాలన్నీ పూర్తిగా కటింగ్‌ పెడతాడని మర్చిపోవద్దు. ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబు నాయుడు చేస్తున్న వాగ్దానాలు, చూపిస్తున్న సినిమాలు, చెబుతున్న కొత్త పథకాలు ఒక్కసారి గమనించండి. ఎన్నికలు అయిపోయిన తరువాత ఇవన్నీ పూర్తిగా రద్దు అయిపోయితాయి చంద్రబాబుకు ఓటు వేస్తే. తనను వ్యతిరేకించే వారిని ఎవర్ని బతకనివ్వడు. తన పోలీసులనే గ్రామం నుంచి రాజధాని వరకు పెట్టుకుంటాడు కాబట్టి.. మనుషులను చంపినా కేసులు ఉండవు. సీబీఐని రానివ్వడు. సీబీఐని రానివ్వడు. ఈడీని రానివ్వడు. పత్రికలు, టీవీలు ఇప్పటికే అమ్ముడుపోయాయి కాబట్టి ఇక మీదట బాబు ఎలాంటి నేరాలు చేసినా కనీసం వార్తలు రాసేవారు ఉండరు. పైగా తానే చంపేసి మీ బంధువులే చంపారని మీ మీదనే దుష్ప్రచారం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేదలు కానీ, మధ్యతరగతి వర్గాలకు ఉద్యోగాలు ఉండవని మర్చిపోవద్దు. ఇప్పటికే బీసీలు జడ్జిలు పనికిరారని లేఖలు రాసిన విషయం మర్చిపోవద్దు. 
 • పొరపాటున చివరి మూడు నెలల్లో చంద్రబాబు చూపిస్తున్న సినిమాలు మీరు నిమ్మితే.. డ్రామాలను నమ్మితే.. ఎన్నికలను వాగ్దానాలను మళ్లీ పొరపాటున నమ్మితే.. టీవీల్లో ఇస్తున్న ప్రకటనలు చూసి నమ్మితే.. నరమాంసాన్ని తినే అందమైన రాక్షసిని నమ్మినట్లే అవుతుందని మర్చిపోవద్దని కోరుతున్నా.. ఒకసారి మోసపోయాం. చంద్రబాబు పాలన చూశాం కాబట్టి మళ్లీ అదే మోసాలకు బలికావొద్దని కోరుతున్నాను. విశ్వసనీయతకు ఓటు వేయండి. ఈ వ్యవస్థలో రాజకీయ నాయకుడు మైక్‌ పట్టుకొని పలానా చేస్తానని చెబితే.. అది చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి రావాలి. రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకురావాలి. మరో 14 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. చంద్రబాబు చెప్పని అబద్ధం, చేయని మోసం, చూపని డ్రామా, చూపని సినిమా కూడా ఉండదని మర్చిపోవద్దు. ఎన్నికల రోజు దగ్గరపడే కొద్ది మన గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. ఆ డబ్బును ప్రతి చేతిలో రూ. 3 వేలు పెడతాడని మర్చిపోవద్దు. మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో తిరగండి.. ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను, ప్రతి తాతను, ప్రతి అవ్వను, ప్రతి అన్నను కలవండి. 
 • చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలు తీసుకొని మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్ను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు అన్న ప్రతి అక్క చేతిలో రూ. 15 వేలు పెడతాడని చెప్పండి. మన పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చదివించగలుగుతున్నామా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదు అక్కా.. పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నాం.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను పెద్ద చదువులు ఎన్ని లక్షలు ఖర్చు అయినా అన్న ఉచితంగా చదివిస్తాడని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. 
 • పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అని చెప్పండి. ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. ఒక్క రూపాయి మాఫీ చేసిన పరిస్థితి లేదు. గతంలో మనకు సున్నావడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత సున్నావడ్డీ ఎగరగొట్టాడు. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఉన్న రుణాలన్నీ మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాడని ప్రతి అక్కకు, ప్రతిచెల్లెమ్మకు చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకి రుణాలు వచ్చేది జగనన్నతోనే సాధ్యమని చెప్పండి.
 • పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 
 • గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. 20 రోజులు ఓపికపట్టు అన్న.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబడుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు..  గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 
 • అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. పెన్షన్‌ వచ్చేది కాదని, లేకపోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. 20 రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 
 • ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఇల్లు లేదు. కట్టిస్తానన్న మాట పోయింది. 20 రోజులు ఓపిక పట్టు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అక్షరాల 25 లక్షల ఇళ్లులు కట్టిస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యంలో ఇళ్లులు కట్టడం చూశాం. మళ్లీ జగనన్నతోనే అది సాధ్యమని ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి.
 • నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి కుటుంబంలోకి తీసుకొనిపోండి. నవరత్నాలతో మన బతుకులు మారుతాయి. మన ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. అది జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పురావాలి. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్‌రావును నిలబెడుతున్నాను. డాక్టర్, మంచివాడు సౌమ్యుడు మంచిచేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి దీవెనలు అన్నపై ఉంచాలని కోరుతున్నాను. అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా పొట్లూరి వరప్రసాద్‌ను నిలబెడుతున్నాను.. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచిచేస్తాడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ప్రసాద్‌పై కూడా ఉంచాలని కోరుతున్నాను. మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు..

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top