రేపటి నవ సమాజ నిర్ణేతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి
 

అమరావతి : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. శనివారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి. తల్లిదండ్రుల ఆశలకు ప్రతి రూపాలు వారు. ఆ చిన్నారులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి చదువొక్కటే. అందుకే చిన్నారుల భవిష్యత్తుని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. రేపటి నవ సమాజ నిర్ణేతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.  

 
కాగా, అంతకు క్రితం రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని భగవంతున్ని కోరుకుంటున్నానని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top