ఆప్కో, లేపాక్షి ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభం

తాడేప‌ల్లి : ఆప్కో, లేపాక్షి ఆన్‌లైన్‌ వెబ్‌స్టోర్‌లను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోర్టల్‌ ద్వారా ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ ద్వారా చేనేత, హస్తకళల ఉత్పత్తుల అమ్మాకాలు జరగనున్నాయి. ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేపట్టడం ద్వారా చేనేత, హస్త కళల కళాకారుల ఉత్పత్తుల తయారీ దారులకు గిట్టబాటు ధర కలిగే అవకాశం ఉంటుంది. కాగా ప్రభుత్వం రూ.10 కోట్ల విలువైన చేనేత, హస్త కళల ఉత్పత్తులను ఆప్కో, లేపాక్షి ఆన్‌లైన్‌ వెబ్‌స్టోర్‌లో ఉంచనుంది. ప్రముఖ ఈ కామర్స్ ఆన్‌లైన్‌ స్టోర్ల ద్వారా చేనేత, హస్త కళల ఉత్పత్తుల అమ్మకాలు జరగనున్నాయి.

Back to Top