వివాహ వేడుకల్లో పాల్గొన్న వైయస్‌ జగన్‌

ఏలూరు:ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కొయ్యే మోషేన్‌రాజు కుమారుడి వివాహం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అంతకుముందు సీఎంకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
 

Back to Top