మైనారిటీల ఆశాజ్యోతి వైయ‌స్ జగన్‌

వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మైనారిటీలు 
 

హైద‌రాబాద్‌: మైనారిటీల ఆశాజ్యోతిగా వైయ‌స్ జగన్‌ వెలుగొందుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ మైనారిటీ సెల్ నాయ‌కులు పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం మైనారిటీ నాయ‌కులు, మ‌త పెద్ద‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు.  ఈ సంద‌ర్భంగా మైనారిటీ నాయ‌కులు మాట్లాడుతూ.. జనం కోసం పాటు పడుతున్న మీకు అంతా మంచి జరగాలని అల్లాను ప్రార్థిస్తున్నామని చెప్పామన్నారు. వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి తమకు రిజర్వేషన్‌ను కల్పించి ఆదుకున్నారని, తమ కుటుంబాలు బాగుపడాలంటే వైయ‌స్ఆర్‌ బిడ్డ జగన్‌ సీఎం కావాలని ఆశిస్తున్నామన్నారు. ఆయనపైనే అన్ని ఆశలు పెట్టుకున్నామన్నారు. సామాన్యులతో సైతం వైయ‌స్‌ జగన్‌ ప్రేమగా మాట్లాడుతున్నారని, జనం సమస్యలపై అవగాహన, వాటిని పరిష్కరించే నేర్పరితనం వైయ‌స్ జగన్‌కే ఉన్నాయని తాము నమ్ముతున్నామని ముస్లింలు అభిప్రాయపడ్డారు. 

 

Back to Top