వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతోపాటు, రీజినల్‌ కో–ఆర్డినే­టర్లు పాల్గొన్నారు. 

టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చిస్తారు. సూపర్‌సిక్స్‌ హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలనివైయ‌స్ఆర్‌సీపీ భావిస్తోంది. ఆ దిశలో పార్టీ నాయకులకు వైయ‌స్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.  

Back to Top