వాయుసేనకు వైయస్‌ జగన్‌ అభినందనలు

హైదరాబాద్‌: భారత వాయుసేన పైలట్లను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. నిర్భయంగా టెర్ర‌రిస్టులను తుదముట్టించిన వాయుసేనను చూసి గర్వపడుతున్నామన్నారు. వాయుసేను అభినందిస్తూ వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాడ శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి.

పుల్వామా ఉగ్రదాడి ఘటనతో రగిలిపోతున్న భారత్‌ వైమానిక దళం... పాకిస్తాన్‌ ఆర్మీకి  దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. పాకిస్తాన్‌ ఆర్మీ తేరుకునేలోపే భారత వైమానిక దళాలు కేవలం 21 నిమిషాల్లో దాడులు పూర్తి చేసుకుని వెంటనే వెనుతిరిగాయి. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్‌ 2000 జెట్‌ ఫైటర్లు...ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దాదాపు వెయ్యి కిలోల బాంబులను వైమానిక దళం ఉగ్రవాద శిబిరాలపై ప్రయోగించగా, జైషే మహ్మద్‌కు చెందిన అల్పా-3 కంట్రోల్‌ రూం పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. 

Back to Top