తాడేపల్లి: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వైయస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు(YS Jagan Congratulate PM Modi). పాతికేళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ సందేశం పంపారు. పాలనాధిపతిగా విశిష్ట సేవలందిస్తూ.. 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు నరేంద్ర మోదీకి అభినందనలు, దేశ సేవలో ఆయన అంకితభావం, పట్టుదల, నిబద్ధతను ప్రతిబింబించే గొప్ప మైలురాయి ఇది. ఈ సందర్భంగా.. ఆయనకు మరింత శక్తి కలగాలని, మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ సందేశం ఉంచారు.