విజయవాడ: వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ కుమార్తె లక్ష్మీ చంద్రిక వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడ లబ్బీపేట ఎస్ ఎస్ కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు లక్ష్మీ చంద్రిక, వేంకట సుబ్రహ్మణ్య సాయికిరణ్‌లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి వైయస్ జగన్ ఆశీర్వదించారు.