బెంగళూరులో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం

బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం బెంగళూరుకు చేరుకున్నారు. లండన్‌ నుంచి వైయ‌స్‌ జగన్‌ దంపతులు శుక్రవారం ఉదయం బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి నగరంలోని తమ నివాసానికి వెళ్లారు. 
విదేశీ పర్యటన ముగించుకుని వైయ‌స్ జగన్‌ వస్తున్నట్లు తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా విమానాశ్రయం వద్దకు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరోవైపు వైయ‌స్ జగన్‌ బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.  
 

Back to Top