వైయస్ఆర్ జిల్లా: ప్రజల కష్టాలు తనకు తెలుసు అని వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతిరెడ్డి పేర్కొన్నారు. వైయస్ అవినాష్ రెడ్డి సతీమణి సమతారెడ్డితో కలిసి వైయస్ భారతి గురువారం వేంపల్లిలో జడ్పీటీసీ షబ్బీర్ కుమారుడి పుట్టిన రోజు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ...వేంపల్లికి తాను కొత్తకాదని, ప్రజల కష్టాలు తనకు తెలుసునని చెప్పారు.ఈ అయిదేళ్లలో ఎవరికీ ఇళ్లు మంజూరు కాలేదని అన్నారు. మహిళలు సంతోషంగా ఉండాలనేది వైయస్ జగన్ ఆకాంక్ష అని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళల పేరుతోనే పట్టాలు ఇస్తామని చెప్పారన్నారు. అలాగే పిల్లలను ఎల్‌కేజీ నుంచి పీజీ వరకూ చదివించడానికి వైయస్ జగన్ అండగా నిలుస్తామని చెప్పారన్నారు. ఇక అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకంలో వెయ్యి రూపాయలు దాటితే ప్రభుత్వమే ఆ ఖర్చు భరిస్తుందన్నారు. డ్వాక్రా మహిళలకు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారని అన్నారు. వైయస్ఆర్ ఆసరా పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నాలుగు దఫాలుగా రూ.75వేలు ఇస్తా ఈసారి చంద్రబాబు నాయుడు మోసాలకు మోసవద్దని వైయస్ భారతి విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ సీపీ ‘నవరత్నాలు’ను ఓటర్లకు వివరించారు. ఈ నెల 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డికు అమూల్యమైన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతిరెడ్డి ఓటర్లను కోరారు.