పోలీసులు అరాచకం సృష్టిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

నేషనల్‌ మీడియాను ట్యాగ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ట్వీట్‌

తాడేపల్లి : ఏపీలో కూటమి ప్రభుత్వం అండదండలతో పోలీసులు రెచ్చిపోతున్నారు.  ఇటీవల దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన ముగ్గురు  యువకులపై తెనాలి పట్టణంలో పట్టపగలే దాడి చేసిన పోలీసులు.. మరో యువకుడు ఆత్మహత్యకు కారణమయ్యారు. పోలీసుల వేధింపులతో సిద్ధేష్ శివాజీ అనే యువకుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

పోలీసుల తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ ధ్వజం
తెనాలిలో పోలీసుల వేధింపులతో మరొకరు బలికావడంపై వైయ‌స్ఆర్‌సీపీ మండిపడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలనే తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ ధ్వజమెత్తింది. కొందరు పోలీసుల దారుణాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ విమర్శించింది. ఈ సంఘటనపై నేషనల్ మీడియాను ట్యాగ్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ట్వీట్ చేసింది.

కాగా, బంగారం రికవరీ కేసులో సిద్ధేష్ ను పోలీసులు వేధింపులకు గురి చేశారు. ఆ ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక సిద్ధేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  దీన్ని తప్పించుకోవడానికి సిద్ధేష్ మృతదేహాన్ని మహారాష్ట్రకు తరలించారు. 

https://x.com/YSRCParty/status/1929188219507331195

Back to Top