శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఏపీహెచ్‌బీ కాలనీలో మంగళవారం ధర్మాన రామ్ మనోహర్ నాయుడు జగనన్నే మా నమ్మకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల కాలంలో కుల,మతాలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నాం. ఇవాళ ప్రజలంతా ఈ నాలుగేళ్ల కాలంలో ఆనందంగా ఉన్నారని చెప్పారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి అన్నవి ఏక కాలంలో చేయగలుగుతున్నారు. రోడ్డు వేస్తేనే అభివృద్ధి కాదు. రోడ్లూ వేయాలి, సంక్షేమమూ చేయాలన్నారు. నాడు - నేడు పేరిట నిర్వహిస్తున్న స్కూల్స్ ను చూడండి ఏవిధంగా అభివృద్ధి చెందాయో అన్నది మీకు తెలుస్తుంది. అలానే చిన్నారులకు ఆధునిక సాంకేతికతతో కూడిన విద్య, విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఉన్నామని, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం అమలులో భాగంగా పోషకాహారం అందిస్తున్నామని, అలానే ధనవంతుల పిల్లలతో సమానంగా పేద బిడ్డలు చదువుకునేందుకు వీలుంగా సౌకర్యాలు కల్పించాం. వారికి బుక్స్, షూ, యూనిఫాం అందించామని తెలిపారు.
ఓ వైపు టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు, మరోవైపు జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ మమ్మల్ని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మేం నమ్ముకున్నది ప్రజలను. వారికి అందిస్తున్న పథకాల సరళిని. మధ్యవర్తుల ప్రమేయం అన్నది లేకుండా అందిస్తున్న సంక్షేమ పథకాల సరళిని. అదేవిధంగా ఇవాళ మేం చేస్తున్న అభివృద్ధి అన్నది పాఠశాలలో ఏ విధంగా ఉన్నది అన్నది అందరికీ తెలుసు. ఇది కాదా మార్పు అని నేను అడుగుతున్నాను. ఇవాళ మేం ధైర్యంగా ప్రజల మధ్యకు వెళ్లగలుగుతున్నాం అంటే అందుకు కారణంగా నిష్పక్షపాతంగా పథకాలను అమలు చేయడమే. అలానే పార్టీలకు అతీతంగా ఇవాళ పథకాల వర్తింపు అన్నది చేస్తున్నాం. కనుక విమర్శలు మానుకోండి. అభివృద్ధికీ, సంక్షేమానికీ సహకరించండి.
ఒకవేళ మేం తప్పులు చేస్తే మా దృష్టికి తీసుకు రండి. తప్పక దిద్దుకుంటాం. సలహాలు ఇవ్వండి. మంచి సలహాలు ఇవ్వండి. అంతేకానీ పొద్దున అయితే చాలు జగన్ ను ప్రజల నుంచి ఏ విధంగా దూరం చేయాలి. ధర్మానను ప్రజల నుంచి ఏ విధంగా దూరం చేయాలి అన్నవి మానుకోవాలి. ఈ ప్రభుత్వం ధనికుల కోసం కాదు పేద ప్రజల కోసం పనిచేస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడని వారి కోసం పని చేస్తున్నాం. మహిళల కోసం పనిచేస్తున్నాం. అవ్వా తాతల కోసం పనిచేస్తున్నాం. నెల రోజుల ముందు గడపగడపకూ మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించాం. అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించి, లబ్ధిదారులను కలవగలిగాం. దయచేసి మేలు చేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి. ప్రజాశీర్వాదంతోనే మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం చేపడుతున్నాం. ఇది కూడా విజయవంతం అవుతుందని విశ్వసిస్తున్నామన్నారు .
కార్యక్రమంలో కర్నేని హరి, పాపారావు స్వామి, రావాడ జోగినాయుడు, గంజి వాసు, రంగాజీ దేవ్, వల్లభ, నవీన్, వాలెంటీర్స్, గృహసారదులు, కన్వీనర్స్ తదితరులు పాల్గొన్నారు.