మహిళా సాధికారతే లక్ష్యంగా వైయ‌స్ జ‌గ‌న్‌ పాలన  

మాజీ మంత్రి కేవీ ఉషాశ్రీ చ‌ర‌ణ్

హిందూపురంలో ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు

శ్రీ స‌త్య‌సాయి జిల్లా:  మ‌హిళా సాధికార‌తే ల‌క్ష్యంగా గ‌త ఐదేళ్లు నాటి ముఖ్య‌మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిపాలించార‌ని శ్రీ స‌త్య‌సాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షురాలు, మాజీ మంత్రి కేవీ ఉషాశ్రీ చ‌ర‌ణ్ తెలిపారు. శ‌నివారం హిందూపురంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించారు. హిందూపురం నియోజకవర్గ  వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త  దీపిక, మహిళలతో కలిసి ఉషాశ్రీ చ‌ర‌ణ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ..  గతంలో 30 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యార‌ని  ఆరోపించిన‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ..ఇప్పుడు వారిని తిరిగి రప్పించే ప‌ని చేస్తున్నారా అని ప్ర‌శ్నించారు.  మ‌హిళ‌ల‌కు ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం కూడా ఈ కూట‌మిప్ర‌భుత్వం నెర‌వేర్చాలేని విమ‌ర్శించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లక్ష్మి, రాధమ్మ, సర్పంచులు లలితమ్మ,  వైయ‌న్‌ భాగ్యమ్మ, కో-ఆప్షన్ కాంతమ్మ, సాహెరా భాను, కవితా రెడ్డి, సిద్ధగంగమ్మ, హరిత రెడ్డి, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.

Back to Top