దిశ చట్టంతోనే రమ్య కేసులో వేగంగా తీర్పు

నిందితుడికి శిక్ష విధించడంతో మృతురాలికి న్యాయం జరిగింది

రమ్య కుటుంబానికి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అండగా నిలిచింది

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

తాడేపల్లి: సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువచ్చిన దిశ చట్టం స్ఫూర్తితోనే బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసులో తీర్పు వేగంగా వచ్చిందని, దోషికి కోర్టు ఉరిశిక్ష విధించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. దిశ స్ఫూర్తితో రమ్య కేసులో ఏడు రోజుల్లోనే పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేసి.. విచారణను త్వరితగతిన పూర్తిచేశారన్నారు. మృతురాలు రమ్య కుటుంబానికి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. 

రమ్య కేసులో కోర్టు తీర్పు అనంతరం మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి మధ్య మీడియాతో మాట్లాడారు. నిందితుడికి 9 నెలల్లో ఉరి శిక్షపడటం రికార్డు అన్నారు. మృతురాలికి న్యాయం జరిగిందన్నారు. దిశ చట్టం స్ఫూర్తితో ఇంత వేగంగా కోర్టు తీర్పులు వస్తే.. మహిళలకు ఎంత న్యాయం జరుగుతుందో రమ్య కేసు ఉదాహరణగా కనిపిస్తుందన్నారు. మహిళల భద్రత కోసమే సీఎం వైయస్‌ జగన్‌ దిశ చట్టం తీసుకువచ్చారని చెప్పారు. రమ్య హత్య జరిగినప్పుడు సీఎం వేగంగా స్పందించారని గుర్తుచేశారు. సీఎం ఆదేశాలతో ప్రత్యేక కోర్టులో కేసును  విచారణ చేసి.. 9 నెలల్లో నిందితుడికి ఉరిశిక్ష పడేలా పోలీసులు చేయగలిగారన్నారు. విచారణను వేగంగా పూర్తి చేయడం వెనుక పోలీసుల కృషి ఎంతో ఉందన్నారు. 
 

Back to Top