లైంగిక వేధింపులపై మహిళా కమిషన్‌ ఆగ్రహం

విచారణకు ఆదేశించిన చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌
 

 నెల్లూరు:  జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ లైంగిక వేధింపులపై మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని మహిళా కమిషన్‌ ఆదేశించింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్‌తో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. వైద్యవృత్తికి మచ్చతెచ్చేలా జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ వ్యవహరించడం బాధాకరమని తెలిపారు. అతడి బాధితులు నిర్భయంగా మహిళా కమిషన్‌కు వివరాలు వెల్లడించాలని చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సూచించారు. ఫిర్యాదులు చేసిన బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ లైంగిక వేధింపుల వ్యవహారంపై దర్యాప్తు జరపాలని వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీని కోరారు. సూపరింటెండెంట్‌ వైద్య విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో గురువారం బహిర్గతమైన విషయం తెలిసిందే.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top