ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశావ్‌..?

ప్రతి కులాన్ని చంద్రబాబు మోసం చేశారు..

ఇసుక,మట్టి,భూములను వదలకుండా దోచుకున్నారు..

చంద్రబాబుకు బుద్ధివచ్చేలా తీర్పు చెప్పాలి..

మాట తప్పని, మడమ తిప్పని వాడే నాయకుడు

నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌

విజయనగరం: చంద్రబాబు పరిపాలించిన ఈ ఐదేళ్లల్లో ప్రజలకు ఏం భద్రత, భరోసా ఇచ్చారని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక,మట్టి,భూములను ఏదీ వదలకుండా దోచుకున్నారని మండిపడ్డారు.నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ బహిరంగసభలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగించారు.ఆయన  మాటల్లోనే.. ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన చూశారు. ముఖ్యమంతి కాక మునుపు ఆయన చేసిన వాగ్ధానాలు చూశారు.ఎన్నికల మేనిఫెస్టో పేరు చెప్పి ప్రతి కులానికి ఒక్కొ పేజీ  కేటాయించారు. ప్రతి కులాన్ని వదలకుండా మోసం చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ రకంగా మోసం చేశాడన్న సంగతి ఒక చంద్రబాబు నుంచే నేర్చుకోవాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాలు చూస్తే.. విజయనగరం సిటీని స్మార్ట్‌ సిటీగా చేస్తారంట, జిల్లాలో మెడికల్‌ కాలేజి అంట మీ ఎక్కడైనా కనిపించిందా? ఫుడ్‌ పార్కు ఎక్కడైన కనిపించిందా? గిరిజన యూనివర్శిటీ  ఎక్కడైనా కనిపించిందా? గోస్తని,చంపావతి నదులు,నాగావళి,వేగావతి అనుసంధానం,వెంగళరాయ సాగర్, వట్టిగడ్డ ఆ«ధునికరణ పనులు,తోటపల్లి మిగిలిన పనులు, వీటిలో ఒక్కటైనా పూర్తి చేశారా అని అడుగుతున్నా. ఇదే పెద్ద మనిషి  పెందుర్తి నుంచి అరుకు వరుకు నాలుగు రోడ్లు చేస్తానన్నాడు. కనిపించిందా అని అడుగుతున్నా..చంద్రబాబు పుణ్యమా అని విజయనగరం, రాజాం, బొబ్బిలి, నెల్లిమర్లలో జూట్‌ మిల్లులు వరుసగా మూతపడ్డాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫెరోలైజ్‌ కంపెనీలు వరుసగా మూతపడుతున్నాయి. భీంసింగి చక్కెర కార్మాగారాన్ని 48 కోట్ల నష్టాలోకి ముంచేశాడు. తోటపల్లి మిగిలిన పనులను పూర్తిచేయలేదు. లక్ష 35వేల ఎకరాలలో 70 వేల ఎకరాలకు సక్రమంగా నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. మట్టి,ఇసుకను వదలలేదు. చివరకు బోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను కూడా నాశనం చేశారు.ఆశతో ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలింది.బోగాపురం ఎయిర్‌పోర్ట్‌ విషయంలో లంచాలు ఇవ్వరని వచ్చిన టెండర్లను పూర్తిగా రద్దు చేశారు.మళ్లీ  ఎన్నికల సమయంలో మీ భవిష్యత్‌ నా బాధ్యత అని చంద్రబాబు ఎన్నికల నినాదం. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలన చూశారు. మీరు ఒప్పుకుంటారా అని ప్రజలను అడుగుతున్నా.రాష్ట్ర ప్రజలందరి ఆధార్, బ్యాంక్‌ వివరాలు, ఆడపిల్లల సెల్‌ఫోను వివరాలు, ఓటర్‌ వివరాలు, వారి ఇళ్లు ఎక్కడుంది.. సర్వే పేరుతో వివరాలన్ని చోరిచేశారు. ఈ వివరాలన్ని సేవా మిత్ర యాప్‌లో లోడ్‌ చేశారు. వివరాలు అన్ని జన్మభూమి కమిటీ సభ్యులుగా ఉన్న తెలుగుదేశం నాయకులకు ఇస్తున్నారు. .మీ భవిష్యత్‌కు చంద్రబాబు భద్రత ఇస్తాడంట ఇటువంటి మీ వివరాలన్ని చోరీ చేసి జన్మభూమి కమిటీ సభ్యులకు, ప్రైవేట్‌ కంపెనీలకు, ఆయన సేవా మిత్ర మెంబర్లకు ఇస్తూ ఎవరికి భద్రత ఇస్తున్నారు అని ప్రశ్నిస్తున్నా.. ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఏం భద్రత,భరోసా ఇచ్చారు అని అడుగుతున్నా. రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఇసుక,మట్టి,భూములను వదలకుండా దోచుకున్నారు. ఎవరికి ఈ పెద్ద మనిషి భద్రత ఇచ్చారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో తెలుగుదేశం నాయకులు అడ్డంగా దొరికిపోతే ఆ నాయకులను అరెస్ట్‌ చేయకుండా భద్రత ఇచ్చింది ఈ నాయకుడు కాదా అని అడుగుతున్నా. పట్టపగలు చింతమనేని అనే ఎమ్మెల్యే మహిళా ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టుకుని ఈడ్చుకోని పోతే ఎవరికి భద్రత ఇచ్చారు అని అడుగుతున్నా. ప్రత్యేకహోదాను తాకట్టును పెట్టి,లేని ప్యాకేజీని తీసుకువచ్చినట్లు చూపించి,విభజన హామీలను అమలు కాకపోయిన కూడా బీజీపీ నాయకులకు సన్మానాలు చేసి,అసెంబ్లీలో తీర్మానాలు చేసి మోసం చేసి ఎవరికి భద్రత ఇచ్చారని అడుగుతున్నా, ఎన్నికల సమయంలో  రైతు రుణాలు మాఫీ చేస్తానని మాఫీ చేయకుండా, గిట్టుబాటు ధరలను ఐదు సంవత్సరాల్లో  రానివ్వకుండా ఎవరికి భరోసా ఇచ్చారని అడుగుతున్నా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న వ్యక్తి అక్కాచెల్లెమ్మల రుణాలను మాఫీ చేయకుండా ఎవరికి భరోసా ఇచ్చారు అని అడుగుతున్నా. ప్రతి యువతకు ఉద్యోగం అన్నాడు..ఉద్యోగం ఇవ్వకపోతే  ప్రతి నెలా రెండు వేలు అన్నాడు.చంద్రబాబు పాలనలో ఆరవై నెలలకు లక్ష ఇరవై వేల రూపాయలు ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నా. ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీని, ముఖ్యమంత్రి పదవిని లాక్కొని, చివరకు తన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకే భద్రత ఇవ్వలేని వ్యక్తి ఎవరికి భద్రత ఇస్తారని అడుగుతున్నా.. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫీయా పెట్టాడు. ఐదేళ్ల లంచగొండుల పాలనలో ఎవరికి గ్రామాల్లో భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్లు అందక, ఇంజనీరింగ్‌ చదవాలంటే ఆస్తులను అమ్ముకుంటే తప్ప చదువులు చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటే ఎవరికి భరోసా ఇచ్చారు అని అడుగుతున్నా.. 108,ఆరోగశ్రీకి భరోసా లేదు. ఏ పథకానికి భరోసా లేదు.ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు దొంగ పనులు చేస్తారు. చట్టానికి దొరకకుండా ప్రజల అధికారాన్ని తనకు భరోసా ఇచ్చేందుకు వాడుకుంటాడు. అధికారం ప్రజలకు మేలు చేయడానికి కాదు. తనకు తాను మేలు చేసుకోనేందుకు.. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి ఏం భరోసా ఇస్తాడు. నాయకుడు అంటే మాట తప్పకూడదు.మడమ తిప్పని వాడే నాయకుడు అవుతాడు. రాష్ట్ర ప్రయోజనాలు విషయంలో రాజీ పడనివాడే నాయకుడు అవుతాడు.చంద్రబాబుకు బుద్ధిచెప్పేలా తీర్పు ఇవ్వాలని కోరుతున్నా. చంద్రబాబు పాలనలో అబద్ధాలు చెబుతాడు,మోసాలు చేస్తాడు.తానే దొంగతనం చేస్తాడు. ఎదుటివారిపై వ్రేళ్లు ఎత్తి చూపించి  దొంగా...దొంగా అంటాడు..తానే మనుషులను చంపిస్తాడు..ఎదుటివారు చంపించారని చెప్పి హంతకుడు..హంతకుడు.. అంటాడు..ఇటువంటి పెద్దమనిషి చంద్రబాబుకు నిన్న ఆయన సతీమణి దిష్టి తీశారంటా..దిష్టి తీసిన ఫొటో ఈనాడులో చూశా..ఈ రాష్ట్రానికి చంద్రబాబు వలన పట్టిన దిష్టిని ఈ రాష్ట్రంలో ఉన్న  కొబ్బరికాయలు,గుమ్మిడికాయలు,నిమ్మకాయలు కలిసిన కూడా ఆయన దిష్టి పోతుందా అని అడుగుతున్నా..చంద్రబాబు మాట్లాడుతున్న అబద్ధాలు చూస్తే మనిషేనా అనిపిస్తోంది. స్థాయి దిగజారి మాట్లాడతాడు..ఐదు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేశాడు..అన్యాయం చేశాడు..విచ్చలవిడిగా అవినీతి చేశాడు.రాజ్యాంగాన్ని తూట్లు పోడిచాడు.ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు  కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను సిగ్గులేకుండా మంత్రిపదవుల్లో కూడా కూర్చోబెట్టాడు ఆ పెద్దమనిషి చంద్రబాబునాయుడు. ఇటువంటి వన్నీ చూస్తుంటే, రాజకీయాలను ఇంతగా భ్రష్టు పట్టించడం చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది. తప్పు తాను చేయిస్తాడు. హత్య తాను చేయిస్తాడు. ఎదుటివారి మీద అభాండాలు వేస్తాడు. మీ అందరికీ కూడా నేను ఒకటే కోరుతున్నా. రాబోయే రోజుల్లో ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తూ వున్నాయి. మోసాలు అబద్దాలు అంతా ఇంతా అంతా వుండవు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు ఏం చేస్తాడో తెలుసా...మూటలమూటల డబ్బులు మీ దగ్గరకు పంపిస్తాడు. మూటల మూటల డబ్బు మీదగ్గరకు వస్తుంది. ప్రతి చేతిలో మూడువేల రూపాయల డబ్బు పెట్టి ప్రలోభపెట్టాలని ఆశపడతారు ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు. మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతావున్నాను. రేప్పొద్దున  మీ దగ్గరకు వచ్చి మూడు, మూడువేల డబ్బులు చేతిలో పెడుతున్నప్పుడు మీరంతా చెప్పండి. మీ గ్రామాల్లో వుంటే అక్కచెల్లెమ్మలకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే మూడువేల రూపాయలకు మోసపోకండి అని వారికి చెప్పండి. ఇరవై రోజులు ఆగండి ...దేవుడి దయవల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అన్న ముఖ్యమంత్రి అవుతాడు. మన పిల్లలకు మనం కేవలం బడులకు పంపిస్తే చాలు.... అన్న సంవత్సరానికి పదిహేనువేలు మన చేతుల్లో పెడతాడని చెప్పండి. ఇవాళ మనం మన పిల్లల్ని చదివించుకునే పరిస్థితుల్లో వున్నామా? ఇంజినీరింగ్‌ చదివించుకోవాలన్నా, డాక్టర్‌ కోర్సులు చదివించుకోవాలన్నా మన పరిస్థితి ఏమిటి? ఆస్తులు అమ్ముకుంటే తప్ప మన పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లేదు. ఇరవై రోజుల్లో అన్న ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబుగారిచ్చే మూడువేలకు మోసపోవద్దు. అన్న ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని లక్షలు ఖర్చయినా మన పిల్లల్ని చదివిస్తాడని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్సార్‌ చేయూత అనే పథకం తీసుకొస్తాడు. 45సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపుల వున్న ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కలకు చెప్పండి. ప్రతి ఒక్కరి చేతిలో 75వేల రూపాయలు చేతిలో పెడతాడని చెప్పండి...నాలుగో దఫాల్లో  చేస్తాడని చెప్పండి.ఇలా అన్న చెప్పిన ప్రతి మాట నిజం చేస్తాడని ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాడని అక్కాచెల్లెమ్మలకు,అవ్వా తాతాలకు,సోదరులందరికి చెప్పండి..మీ అప్యాయత,అనురాగాలకు మరోసారి శిరస్సు వచ్చి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను.

Back to Top