వైయస్ఆర్ జిల్లా: నాలుగు రోజుల వైయస్ఆర్ జిల్లా పర్యటన ముగించుకుని బెంగళూరు రోడ్డు మార్గంలో వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ కు దారిపొడవునా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు స్వాగతం పలికారు. వైయస్ఆర్ జిల్లా పులివెందుల–బెంగళూరు మార్గంలోని పల్లెల జనమంతా రోడ్డుపైకి వచ్చేశారు.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు.. తమ అభిమాన నాయకుడు,వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆ రహదారిలో వెళ్తున్నారని తెలుసుకుని ఆయా గ్రామాల వద్ద రోడ్డుపై తిష్ట వేశారు.. దారి పొడువునా జననేతకు బ్రహ్మరథం పట్టారు. వారి అభిమానానికి ముగ్దుడైన వైయస్ జగన్ సైతం ఏ ఒక్కరినీ నిరాశ పరచకుండా అందరినీ పలకరిస్తూ, సెల్ఫీలు దిగుతూ, అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మార్గం మధ్యలో ఆయా గ్రామాల్లో నేతలందరినీ పేరు పేరునా పలకరిస్తూ ముందుకు సాగారు. అంబకపల్లి క్రాస్, దొరిగల్లు, ముదిగుబ్బ, కట్టకిందపల్లె, బత్తలపల్లి టోల్ ప్లాజా, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి క్రాస్, గుట్టూరు క్రాస్, సోమందేపల్లె, కొడికొండ చెక్ పోస్ట్ వద్ద ప్రతీ చోటా తనను చూసేందుకు, కలిసేందుకు వచ్చిన వారందరినీ పలకరిస్తూ బెంగళూరు వెళ్ళారు.