శాస‌న మండ‌లి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల వాకౌట్‌

అమ‌రావతి:  మంత్రి స‌త్య‌కుమార్ తీరును నిర‌సిస్తూ  శాస‌న మండ‌లి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల వాకౌట్ చేశారు. శాస‌న మండ‌లిలో మంత్రి స‌త్య‌కుమార్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. డ‌యోరియా మ‌ర‌ణాల‌పై మంత్రి అవ‌హేళ‌న‌గా మాట్లాడారు. స‌భ్యుల ఆవేద‌న చూసి ముచ్చ‌టేస్తుందంటూ హేళ‌న‌గా మాట్లాడారు. 15 ఏళ్ల‌లో ఎన్న‌డూ లేని మ‌ర‌ణాలు వ‌చ్చాయంటూ మంత్రి న‌వ్వుతూ మాట్లాడారు. మంత్రి స‌త్య‌కుమార్ వ్యాఖ్య‌ల‌పై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. మంత్రి వ్యాఖ్య‌ల‌పై శాస‌న మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంత్రి వ్య‌క్తిగ‌తంగా మాట్లాడ‌టం స‌రికాద‌ని త‌ప్పుప‌ట్టారు. మంత్రికి పైశాచిక ఆనందం ఉండ‌వ‌చ్చు కానీ, స‌భ‌లో హుందాగా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని హిత‌వు ప‌లికారు. 

Back to Top