తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వీఆర్‌ఏ సంఘం నాయకులు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వీఆర్ఏల సంఘం నాయకులు కలిశారు. టీడీపీ ప్రభుత్వం గతంలో వీఆర్‌ఏలకు ఇస్తున్న రూ. 300 డీఏను రద్దు చేసిన విషయం కొద్దిరోజుల క్రితం సీఎం దృష్టికి తీసుకెళ్ళి దానిని కొనసాగించాలని కోరిన ఏపీజీఎఫ్ ప్రతినిధులు. ఇందుకు సీఎం వైయస్ జగన్ సానుకూలంగా స్పందించి రూ. 300 కు బదులుగా డీఏని రూ. 500 కు పెంచి మంజూరు చేశారు. దీంతో వీఆర్ఏ సంఘం నాయకులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీజీఎఫ్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సీఎంని సత్కరించారు. సీఎం వైయస్ జగన్‌ను కలిసిన వారిలో వీఆర్‌ఏ సంఘ నాయకులు ధైర్యం, సత్యరాజ్, సుధాకర్, వెంకటేశ్వర్లు ఉన్నారు.