వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు..

వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి...

రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి..

అనంతపురం: మంత్రి పరిటాల సునీతకు ఓటమి భయం పట్టుకుందని,తనకు అనుకూలంగా ఉన్న అధికారుల ద్వారా వైయస్‌ఆర్‌సీపీ ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నారని వైయస్‌ఆర్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త  తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  ఓట్ల తొలగింపుపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

14వేల ఓట్ల తొలగింపునకు కుట్ర...

వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుకు పరిటాల సునీత కుట్రలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నేతలు అధికారం దుర్వినియోగం జరుగుతున్నట్లుగా ఆ నాయకులు తెలిపారు.ఓటర్ల జాబితా తనిఖీల పేరుతో వైయస్ఆర్ కాంగ్రెస్ సానుభూతి పరుల వద్దకు వెళుతున్న సిబ్బంది, వారి పేర్లతో రెండు ఓట్లున్నాయనీ, వాటిలో ఒకదానిని తొలగించాల్సి ఉన్నందున అందుకు దరఖాస్తు ఇవ్వాలని చెపుతూ, వారి పేరుతో ఉన్న ఒకే ఒక ఓటును తొలగిస్తున్నారని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఓటరు జాబితాల పరిశీలన కోసం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ను కూడా అధికార పార్టీ వారు తమకు అనుకూలంగా మలచుకుని వైయస్‌ఆర్‌సీపీకి చెందిన నేతలు,కార్యకర్తల ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి  ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో ఓట్లు తొలగింపు తంతు యథేచ్ఛగా జరుగుతోందని ఎన్నికల అధికారులకు వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. 

 

Back to Top