కొన‌సాగుతున్న `వైయ‌స్ఆర్ పెన్ష‌న్ కానుక‌` పంపిణీ

తాడేప‌ల్లి: రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్ పెన్షన్ కానుక‌ పంపిణీ కొనసాగుతోంది. తెల్లవారుజామున నుంచే వలంటీర్లు ఇంటింటికి వెళ్లి ల‌బ్ధిదారుల‌కు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 62.53 లక్షల మంది పెన్షనర్ల కోసం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వం రూ.1590.50 కోట్లు విడుదల చేసింది. ఉద‌యం నుంచి  పింఛన్ల పంపిణీ పండుగ‌లా కొన‌సాగుతోంది. వ‌లంటీర్లు ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల‌కు వెళ్లి.. పెన్ష‌న్ న‌గ‌దు అంద‌జేస్తున్నారు. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్‌ అందలేదన్న ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని డిప్యూటీ సీఎం, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top