విశాఖ పరిపాలన రాజధానిగా మారనుంది

ఉద్యోగాల కల్పనకు 8 ఫిషింగ్‌ హార్బర్లు

రాష్ట్ర వ్యాప్తంగా 30 స్కిల్‌డెవలప్‌మెంట్‌ కాలేజీలు, విశాఖలో యూనివర్సిటీ

మేధోమథన సమీక్షలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: రాష్ట్రానికి సంబంధించి మూడేళ్లలో చేయబోయే ప్రాజెక్టులను గుర్తించామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కచ్చితంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులేంటని ఆలోచన చేస్తే.. రామయపట్నం, మచిలీపట్నం, బావనపాడులో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులు ఏర్పాటు చేయనున్నామన్నారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం.. విశాఖ పరిపాలన రాజధానిగా మారనుంది. అక్కడ మెట్రో రైల్, అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉందన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి టెండర్లు ప్రక్రియ పూర్తయిందని, జీఎంఆర్‌కు రీకాంట్రాక్టు ఇవ్వడం జరిగిందన్నారు. మేధోమథన సదస్సులో సీఎం మాట్లాడుతూ.. 

'ఇవేకాకుండా స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎనిమిది ఫిషింగ్‌ హార్బర్లు నిర్మించనున్నాం. కడపలో రూ.15 వేల కోట్లతో రెండున్నర మిలియన్‌ టన్నుల ఉత్పత్తితో కూడిన స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా పారిశ్రామిక వేత్త ఆసక్తి చూపితే ప్రభుత్వం భాగస్వామ్య ఒప్పందంతో నిర్మాణం చేపట్టేందుకైనా.. లేక వారికి నిర్మాణ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నాం. రా మెటీరియల్‌కు సంబంధించి ఎన్‌ఎండీసీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. డీఆర్‌డీఓ సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఇనిస్టిట్యూషన్‌తో స్టీల్‌ సప్లయ్‌ చేసే పరిస్థితిలోకి ఒప్పందం చేసుకుంటున్నాం. 

పరిశ్రమలు పెట్టే వారికి భూమి పరంగా, నీరు పరంగా, విద్యుత్‌ పరంగా, అతిముఖ్యమైన స్కిల్డ్‌ వర్క్‌ఫోర్స్‌ను అందించగలం. స్కిల్డ్‌ వర్క్‌ఫోర్స్‌ తీసుకువచ్చేందుకు 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు తీసుకువస్తున్నాం. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఏర్పాటు చేయడమే కాకుండా మరో ఐదు కాలేజీలు అదనంగా మొత్తం 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు తీసుకువస్తున్నాం. ఇక్కడ కూడా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన కంపెనీలను ఇందులో భాగస్వామ్యం చేయాలని చూస్తున్నాం. ఈ కాలేజీలు ఇంజనీరింగ్, డిప్లమా చేసిన పిల్లలకు అత్యున్నతస్థాయి నాలెడ్జ్‌ను అందించేందుకు ఉపయోగపడతాయి. ఇవేకాకుండా ఆర్టిఫిషియల్‌ ఇంటలీజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, ఇటువంటి కోర్సులు అందించేలా విశాఖలో హై అండ్‌ స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి పట్టణాలతో పోటీ పడాలన్నా.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు రావాలన్నా.. విశాఖపట్నం అనువైన స్థలం’ అని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు.

 

Back to Top