కిరాత‌క చ‌ర్య‌..

కొలంబో పేలుళ్ల ఘటనను ఖండించిన వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి 

 హైదరాబాద్‌ : శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్ల ఘటనను వైఎస్ఆర్‌సీపీ అధ్య‌క్షులు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  తీవ్రంగా ఖండించారు. బాంబు పేలుళ్లలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పౌర సమాజంలో మూర్ఖపు హింసకు తావులేదంటూ వైఎస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

Back to Top