రాష్ట్రమంతా అభివృద్ది చేయాలన్నదే సీఎం ఆకాంక్ష  

ఎంపీ విజయసాయిరెడ్డి
 

 
 విశాఖపట్నం: కుల, మతాలకు అతీతంగా రాష్ట్రమంతా అభివృద్ది చేయాలన్నదే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆకాంక్ష అని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శనివారం విశాఖలో నిర్వహించిన వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకల్లో విజయసాయిరెడ్డి పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అధికార వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందుతాయని  అన్నారు. విశాఖ పరిపాలనా రాజధానిగా ప్రకటించబడితే చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.  వైయస్‌ జగన్ గత ఆరు నెలలలో మంచి పరిపాలన అందించారని హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేసిందని... అయితే ఆయన ఎంత మృదు స్వభావో.. ఎంత మంచి వ్యక్తో ప్రజలు దగ్గరగా చూశారన్నారు. రాష్ట్రానికి 30 ఏళ్లపాటు వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు.  సీఎం వైయస్‌ జగన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని వైయస్‌ఆర్‌సీపీ  నాయకులు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మంత్రి అవంతి శ్రీనివాసరావు,  తిప్పల నాగిరెడ్డి, వీఎంఆర్డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, సిటీ అధ్యక్షుడు కృష్ణశ్రీనివాస యాదవ్‌, మల్లా విజయప్రసాద్‌, అక్కరమాని విజయనిర్మల, కెకె రాజు, కోలా గురువులు, వరుదు కళ్యాణి, గరికిన గౌరి, రొంగల జగన్నాథం, కొయ్యా ప్రసాదరెడ్డి, ఫక్కి దివాకర్‌, జాన్‌ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

 
 

Back to Top