ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

బైక్‌పై మంత్రి వెల్లంపల్లి సుడిగాలి పర్యటన
 

 విజయవాడ : ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అధికారులను హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆయన శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. ద్విచక్ర వాహనం నడుపుకొంటూ వీధుల్లో తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గట్టు వెనుక ప్రాంతం 29వ డివిజన్‌లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. రోడ్ల పనులను వేగవంతం చేసి సత్వరం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని స్పష్టం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top