గురజాల అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు

రైల్వే ఎస్పీకి లేఖ పంపిన ‘మహిళా కమిషన్‌’ 

 అమరావతి: గురజాల రైల్వే హాల్ట్‌లో మహిళపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను వెంటనే పట్టుకోవాలని, కేసు దర్యాప్తును ముమ్మ రం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ రైల్వే పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె విజయవాడ రైల్వే ఎస్పీకి లేఖ పంపారు. కేసు నమోదు చేసిన నడికుడి రైల్వే పోలీస్‌ సీఐ శ్రీనివాసరావుతో ఆమె ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలను ఆరాతీశారు.

బాధితురాలి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు రైల్వేతో పాటు పోలీసు శాఖ కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును శరవేగంగా చేధించాలని కోరారు. బాధితురాలి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆమెతోపాటు తనతో ఉన్న చంటిబిడ్డ సంరక్షణ బాధ్యతను మహిళా శిశు సంక్షేమ శాఖ చూసుకోవాలని ఆదేశించారు.

Back to Top