ఘ‌నంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుక‌లు

అనంత‌పురం:  సంస్కృత భాషలో ఆదికవి, శ్రీరాముని చరితను రసరమ్యంగా లిఖించి రామాయణాన్ని మనకు అందించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుక‌లు శ‌నివారం ఘ‌నంగా నిర్వ‌హించారు. వాల్మీకి  జయంతి సందర్భంగా  రాష్ట్ర పండుగగా జరుపుకోవడం సంతోషదాయకమని మాజీ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. సొమందేపల్లిలో మహర్షి వాల్మీకి జయంతి ని పురస్కరించుకుని వాల్మీకి విగ్రహానికి శంక‌ర్ నారాయ‌ణ‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ మంగమ్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top