వాహ‌న మిత్ర ల‌బ్ధిదారుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఫొటో సెషన్ 

విశాఖ‌:  వైయ‌స్ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏయూ ఇంజనీరింగ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం వైయ‌స్సార్‌ వాహన మిత్ర లబ్ధిదారులతో ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు.అనంత‌రం మ‌హిళా ల‌బ్ధిదారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు రాఖీ క‌ట్టి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
2022–23కుగాను ఈ పథకం కింద 2,61,516 మంది అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సిక్యాబ్‌ డ్రైవర్లకు ఈ ప్రయోజనం కలి్పంచనుంది. ఒక్కో లబి్ధదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తారు. దీంతో ఈ నాలుగు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ‘వైయ‌స్సార్‌ వాహన మిత్ర’ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.1,026 కోట్లను పంపిణీ చేస్తారు.

తాజా వీడియోలు

Back to Top