సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన యూపీఎస్‌సీ ర్యాంక‌ర్లు

తాడేప‌ల్లి: ఏపీకి చెందిన 17మంది యూపీఎస్‌సీ (సీఎస్‌ఈ) 2022 ర్యాంకర్లు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. యూపీఎస్‌సీ ర్యాంక‌ర్ల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. ర్యాంకర్ల కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, సివిల్స్‌ ప్రిపరేషన్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని, మంచి పరిపాలనలో భాగస్వాములై ప్రజా సేవలో తనదైన ముద్ర వేయాలని ర్యాంకర్లకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. 

సీఎంను క‌లిసిన ర్యాంక‌ర్లు వీరే..
జీవీఎస్‌ పవన్‌ దత్తా, తిరుపతి (ర్యాంక్‌ 22), ఎం.శ్రీ ప్రణవ్, గుంటూరు (60), ఎల్‌.అంబికా జైన్, కర్నూలు (69), షేక్‌ హబీబుల్లా, కర్నూలు (189), కేపీఎస్‌ సాహిత్య, వైజాగ్‌ (243), బి.ఉమామహేశ్వర రెడ్డి, కదిరి (270), పి.విష్ణువర్ధన్‌ రెడ్డి, విజయవాడ (292), వి.లక్ష్మీ సుజాత, మార్టూరు (311), బి.వినూత్న, ఒంగోలు (462), సీ.సమీర్‌ రాజా, ఆదోని (464), ఆర్‌.నవీన్‌ చక్రవర్తి, తాళ్ళచెరువు, పల్నాడు జిల్లా (550), వైయూఎస్‌ఎల్‌ రమణి, ఎదరాడ, బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా (583), టి.హేమంత్, చిలకలూరిపేట (593), పి.భార్గవ్, విజయనగరం (772), కే. శ్రీకాంత్‌ రెడ్డి, శిరిగిరిపాడు, పల్నాడు జిల్లా (801), ఎం.సుజిత్‌ సంపత్, నందిగామ (805), ఎన్‌. కృపాకర్, కడప (866).

Back to Top