ఏపీలో ప్యాక్స్‌ కంప్యూటరీకరణ

రాజ్య‌స‌భ‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్న‌కు కేంద్ర‌మంత్రి అమిత్‌షా జ‌వాబు

న్యూఢిల్లీ : వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లోని 1922 ప్రాథ‌మిక వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటరీకరణ చేయనున్నట్లు సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. రాజ్యసభలో బుధవారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబిచ్చారు. కంప్యూటరీకరణ ద్వారా దేశంలోని 63 వేల ప్రాథ‌మిక వ్యవసాయ పరపతి సంఘాల సామర్థ్యాన్ని పెంపొందించి, వివిధ రకాల సేవలు అందుబాటులోకి తేవడం, పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం కంప్యూటరైజేషన్‌ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. రాష్ట్ర సహకార బ్యాంక్‌ల జాతీయ సమాఖ్య (నాప్స్‌కాబ్‌) లెక్కల ప్రకారం 2019-20 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 1,992 ప్రాథ‌మిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. వాటిలో 1922 సంఘాలలో ఇప్పటికే నాబార్డ్ సర్వే చేసింది. ఈ మొత్తం సంఘాలలో ఎన్నింటిని కంప్యూటరీకరణ చేయాలో  రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర‌మంత్రి చెప్పారు.

Back to Top