వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు

వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్సీ  లేళ్ళ అప్పిరెడ్డి,  పలువురు పార్టీ నేతలు. 

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో సంప్రదాయబద్ధంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వ‌హించారు.  కేంద్ర కార్యాల‌య ఇన్‌చార్జ్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, త‌దిత‌రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  
        ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, శాసనమండలి సభ్యులు లేళ్ళఅప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఈ శోభకృత్ నామసంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ వైయస్ జగన్ గారి పాలనలో ఆయురారోగ్యాలతో,  సిరిసంపదలతో విలసిల్లాలని అభిలషించారు. పార్టీ కార్యకర్తలకు,నేతలకు,  ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 

 కార్యక్రమంలో నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్  నారాయణమూర్తి, రాష్ట్ర గ్రంథాలయసంస్థ ఛైర్మన్   మందపాటి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top