సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన టీటీడీ నూత‌న చైర్మ‌న్ భూమ‌న‌

తాడేప‌ల్లి:  టీటీడీ నూతన ఛైర్మన్‌ గా నియమితులైన ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. టీటీడీ ఛైర్మన్‌గా తనకు అవకాశం కల్పించిన సీఎం వైయ‌స్‌ జగన్‌కు భూమన కరుణాకర్‌ రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రేపు ఉదయం తిరుమలలో టీటీడీ చైర్మన్‌ గా భూమన కరుణాకర్‌ రెడ్డి  బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎంని కలిసిన వారిలో భూమ‌న‌ తనయుడు భూమన అభినయ్‌ రెడ్డి ఉన్నారు.

Back to Top